ఎర్రకాలువ నీరూ ‘కృష్ణా’ర్పణం | red canal water taken to " krishna ' | Sakshi
Sakshi News home page

ఎర్రకాలువ నీరూ ‘కృష్ణా’ర్పణం

Published Thu, Sep 29 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

ఎర్రకాలువ నీరూ ‘కృష్ణా’ర్పణం

ఎర్రకాలువ నీరూ ‘కృష్ణా’ర్పణం

అనంతపల్లి (నల్లజర్లæ) : గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎర్రకాలువ నీరును పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. ఎర్ర కాలువపై నబీపేట వద్ద ఉన్న గ్రోయిన్‌(అడ్డకట్ట)కు తాత్కాలిక మరమ్మతులు చేసి తద్వారా అనంతపల్లి సప్లై ఛానల్‌ నుంచి సైఫన్‌ దిగువన స్ట్రక్చర్‌ (10 తూరలు) ఏర్పాటు చేసి పోలవరం కుడికాలువలో ఎర్రకాలువ వరద నీరు కలుస్తుందని పట్టిసీమ ఎత్తిపోతల నీటితో పాటు ఈ నీరు కలుస్తుందని పనులు పర్యవేక్షిస్తున్న ఎర్రకాలువ ఏఈ భాస్కరావు తెలిపారు. సైఫన్‌ వద్ద షట్టర్‌ ఏర్పాటు చేసి వరద సమయంలో వచ్చే అదనపు (5 వేల క్యూసెక్కులు) నీటిని పోలవరం కాలువకు మళ్లిస్తారని చెప్పారు. అయితే దిగువ ప్రాంతంలో పంట పొలాలకు సాగు నీరు అందించకుండా సప్లై ఛానల్‌కు ఇసుక బస్తాలు అడ్డం వేసి మొత్తం నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. ఈ ఛానల్‌ ద్వారా నబీపేట, అనంతపల్లి, గుండేపల్లి, తూర్పుచోడవరం గ్రామాల్లోని1,200 ఎకరాల ఆయకట్టు భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నబీపేట గ్రోయిన్‌ నుంచి సైఫన్‌ వరకు 1.80 కి.మీ మేర సప్లై ఛానల్‌ వెడల్పు చేసి కొంగువారుగూడెం రిజర్వాయర్‌ నుంచి వచ్చే నీటిని, రిజర్వాయర్‌ దిగువన జల్లేరు, బైనేరు, పులివాగుల నుంచి వచ్చే వరద నీటిని కృష్ణాకు తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. దీనిపై నీటి పారుదల శాఖ అధికారులను వివరణ కోరగా నీటి తరలింపు విషయంలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని, పట్టిసీమ పనులు చేపట్టిన ఇంజనీర్ల  బృందం, కాంట్రాక్టు వారే ఈ పనులు చేపట్టారని చెబుతున్నారు.
 
 

Advertisement
Advertisement