సురభి గార్డెన్స్‌లో అటవీశాఖ అధికారుల సోదాలు
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సురభి గార్డెన్స్‌లో అటవీశాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. చట్ట విరుద్ధంగా జాతీయ పక్షి నెమలి సహా పలు వన్యప్రాణులను పెంచుతున్నట్లు పక్కా సమాచారం అందటంతో పోలీసుల సాయంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
భూ ఆక్రమణలు సహా పలు అక్రమాలకు సురభి గార్డెన్స్ యాజమాన్యం పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా బుధవారం రాత్రే సురభి గార్డెన్స్‌లో కంటోన్మెంట్ అధికారులు సీజ్ చేశారు. అలాగే వైల్డ్‌లైఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.