డౌన్ సిండ్రోమ్‌పై అవగాహన సదస్సు
కొరుక్కుపేట, న్యూస్‌లైన్:
డౌన్ సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డౌన్ సిండ్రోమ్ అసోసియేషన్ ఆఫ్ తమిళనాడు (డీఎస్‌ఏటీ) అధ్యక్షురాలు సురేఖరామచంద్రన్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో డౌన్ సిండ్రోమ్‌పై అవగాహన తీసుకుని వచ్చే విధంగా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. సురేఖరామచంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ, డౌన్ సిండ్రోమ్‌కు గురైన కారణాలపై, అందులో వచ్చిన చికిత్స విధానాలపై అవగాహన తీసుకు వచ్చేలా చెన్నై నగరంలో 12వ ప్రపంచ డౌన్ సిండ్రోమ్ కాంగ్రెస్(డబ్ల్యూడీఎస్‌సీ) పేరుతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
2015వ సంవత్సరం ఆగస్టు 17 నుంచి 21 వరకు చెన్నైలో తొలిసారిగా డౌన్ సిండ్రోమ్ సదస్సుకు వివిధ దేశాల నుంచి డౌన్ సిండ్రోమ్‌కు గురైన చిన్నారులు, నిపుణులు, పరిశోధకులు హాజరు కానున్నారని అన్నారు. ఆసియా పసిఫిక్ డౌన్ సిండ్రోమ్ ఫెడరేషన్(ఏపీడీఎస్ఎఫ్) డౌన్ సిండ్రోమ్ ఇంటర్నేషనల్(డీఎస్ఐ) సభ్యులతో కలిసి డౌన్ సిండ్రోమ్‌పై అవగాహన తీసుకుని రానున్నట్లు తెలిపారు. డీఎస్టీఏకు జెట్ ఎయిర్వేస్ సహకారం అందిస్తుందన్నారు. చెన్నైను సందర్శించే డౌన్ సిండ్రోమ్ చిన్నారులకు ఎయిర్ టికెట్లో ప్రత్యేక రాయితీలను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన డౌన్ సిండ్రోమ్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.