విజృంభించిన సురేంద ర్, రేవంత్
జింఖానా, న్యూస్‌లైన్: సురేందర్ సింగ్ (4/22), రేవంత్ (3/15) విజృంభించడంతో విశాక జట్టు 103 పరుగుల తేడాతో బడ్డింగ్ స్టార్స్‌పై గెలిచింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో తొలి రోజు బ్యాటింగ్ చేసిన విశాక 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రేవంత్ సాయి (43), మెహర్ ప్రసాద్ (44), అబ్దుల్ మాజీద్ (36) రాణించారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బడ్డింగ్ స్టార్స్ 83 పరుగులకు ఆలౌటైంది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో బౌలర్స్ రవి (5/14), పవన్ (5/30) చెలరేగడంతో కాకతీయ జట్టు 10 వికెట్ల తేడాతో సదరన్ స్టార్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ స్టార్స్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 44 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ వికెట్లేమీ నష్టపోకుండా 46 పరుగులు చేసి గెలుపొందింది. సత్య సీసీ, భారతీయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సత్య సీసీ 381 పరుగులు చేసింది. భారతీయ జట్టు బౌలర్లు సోమశేఖర్ 5, అశోక్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. తర్వాత బరిలోకి దిగిన భారతీయ ఒక వికెట్ కోల్పోయి16 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ
మెదక్: 147 (నరేష్ 43; హరీష్ 4/16); నిజామాబాద్: 128 (ఈశ్వర్ 30; భరత్ కుమార్ 4/21, మనోహర్ 3/17).
ఖమ్మం: 145 (అనిల్ 36; వినోద్ 3/34); ఆదిలాబాద్: 148/2 (ప్రదీప్ 53 నాటౌట్, శ్రవణ్ కుమార్ 47).
వరంగల్: 142/7 (నవరసన్ 43); కరీంనగర్: 143/8 (షానవాజ్ 36).