suresh setkari
-
సాదాసీదాగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ చివరి స మావేశం శనివారం మొక్కుబడిగా.. సాదాసీదా గా ముగిసింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవి ర్భావం.. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో సాగిన సమావేశం ఏటీఆర్ (చర్యల నివేదిక) జోలికి వెళ్లలేదు. ఎజెండాలో చేర్చిన 11 ప్రధానమైన అంశాలపై మూడున్నర గంటల్లో చర్చించి మమ అనిపించారు. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ మధుయాష్కీ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-చైర్మన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, రాజ్యసభ సభ్యులు మహ్మద్ అలీఖాన్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో మధుయాష్కీ 29వ రాష్ట్రంలో జిల్లా చివరి విజిలెన్స్, మానిటరింగ్గా పేర్కొం టూ... తెలంగాణవాదులు, అధికారులు, ప్రజలకు ‘తెలంగాణ’ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరవీరులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ప్రొటోకాల్ పేరుతో ఆటంకాలు : అన్నపూర్ణ ఆవేదన ఆభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై స్పష్టత లేదంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి (ప్రస్తుతం మాజీ మంత్రి) సుదర్శన్ రెడ్డి, ఎన్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ తదితర అధికారు ల తీరు వల్ల ఆర్మూరు నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయలేని పరిస్థితి నెలకొందని ఎమ్మె ల్యే అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్‌రెడ్డి సమయం ఇవ్వకపోవడం... అధికారులు ఆయన రానిదే శిలాఫలకం వేయలేమని ‘ప్రొటోకాల్’ పేరిట హక్కులను హరించారని, నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యేలు ఏ పనులు చేపట్టాలనుకున్నా తమ దృష్టికి తేవాలని, ప్రభుత్వ నిబంధనలు, ప్రొటోకాల్స్ని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి పనులు సాగేలా చూస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సేద్యానికి పనికి రాని భూములను గుర్తించి ఆ భూముల్లో ఈత, తాటిచెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడం వల్ల 3.50 లక్షల గీత కార్మీకులకు ఉపాధి లభించేలా చూడాలన్నారు. అర్బన్ శాసనసభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ నగరంలో ఐదు తాగునీటి ట్యాంకులు నిర్మాణమై ట్రయిల్న్ ్రకూడా పూర్తి అయినందున ప్రజలకు తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు వెయ్యిమందే కనెక్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారని, 25 వేల మందికి అవకాశం ఉందని కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కమిషనర్ మంగ తాయారును ఆదేశించారు. రూ.23 కోట్ల నష్టపరిహారంపై సభ్యుల ఆందోళన 2010 నుంచి జిల్లాలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నపూర్ణమ్మ, యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఆంధ్ర ప్రాతానికి చెందిన మూడు జిల్లాలకు రూ.800 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లా ప్రజలపై వివక్ష చూపిందన్నారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వడగళ్లకు భారీగా పంటలు దెబ్బతిన్నాయని, తక్షణమే సర్వే జరిపించి పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రద్యుమ్న స్పందిస్తూ రెండు రోజులుగా కురిసిన వర్షం కారణంగాా దెబ్బతిన్న గ్రామాల్లో వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారని, పూర్తికాగానే నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామన్నా రు. కాగా 11 అంశాల ఎజెండాపై విజిలెన్స్, మాని టరింగ్ కమిటీలో చర్చించిన సభ్యులు.. రాష్ర్టపతి పాలన... ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున జిల్లా అభివృద్ధిని కలెక్టరే చూసుకోవాలంటూ ఆయనపై భారం వేశారు. ఎన్నికల పోటీ పరీక్షలో మేము బీజీ అయిపోతామంటూ.. కలెక్టర్ ఈ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరడంతో ‘ మాకు కూడా ఎన్నికల ఏర్పాట్ల బిజీ ఉంటుందం’టూ చలోక్తి విసిరారు. సభలో మధుయాష్కీ, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నపూర్ణమ్మలు పార్టీలపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు, చలోక్తులు సభికులను పలుమార్లు నవ్వించాయి. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఏజేసీ శేషాద్రి, వివిధశాఖల ఉన్నతాధికారులు శివలిం గయ్య, నగేశ్, వెంకటేశం, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు. -
ఆట మొదలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే కార్యక్రమం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. యువ నేత రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే ఆనందరావు దేడ్మరే ఏఐసీసీ పరిశీలకుడుగా కామారెడ్డిలో మకాం వేశారు. రాత్రి పొద్దుపోయేవరకు నియోజకవర్గాలవారీగా ప్రజాప్రతినిధులు, పార్టీ బ్లాక్, మండల అధ్యక్షులు, ముఖ్యనాయకుల అభిప్రాయాలను స్వీకరించారు. ఏఐసీసీ పరిశీలకు డు వస్తున్నారన్న విషయం ముందుగానే లీక్ కావడంతో అసెంబ్లీకి పోటీచేయాలనుకుంటు న్న ఆశావహులు తమ అనుచరులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలను కామారెడ్డికి తరలించా రు. ఏఐసీసీ పరిశీలకుడు, ఆయన వెంట వచ్చిన మరో నాయకుడు ప్రత్యేక గదిలో నా యకులను కలుసుకున్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, జనార్దన్‌గౌడ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, నాయకులు ఆకుల శ్రీనివాస్, వెంకట్రామ్రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మామిండ్ల అంజయ్య, బాలరాజు, కైలాస్ శ్రీనివాస్, శివకుమార్, జమునారాథోడ్ తదితరులు మరో గదిలో కార్యకర్తలతో కలిసి ఉన్నారు. బలప్రదర్శన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు బలప్రదర్శన ను తలపించే విధంగా గ్రూపులుగా తరలివచ్చారు. కొంత మంది ఆశావహులైతే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి కార్యకర్తలను తీసుకువచ్చారు. కార్యకర్తలకు భోజనాలతో పాటు అన్ని వసతులను కల్పించారు. అభిప్రా య సేకరణ కార్యక్రమం మొక్కుబడిగా సాగినప్పటికీ, రాత్రి పొద్దుపోయేవరకు కార్యకర్తలు అక్కడనే వేచి ఉన్నారు. అభిప్రాయ సేకరణ సందర్భంగా పలువురు నేతలపై ఆరోపణల పరంపర కొనసాగినట్టు సమాచారం. కొందరు నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అక్కసును వెళ్లగక్కినట్లు తెలిసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు కేటాయించకుండా, ఇతర పార్టీల వారికి కేటాయించిన విషయాలను కూడా పలువురు ప్రస్తావించినట్లు తెలిసింది. పరిశీలనకు పలువురి పేర్లు జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఏఐసీసీ పరిశీలకుడి ఎదుట ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, గంగారాం, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ పేర్లను వారివారి అనుచరులు ప్రతిపాదించారని సమాచారం. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ మంత్రి ఆంజనేయులు, జమునా రాథోడ్‌తోపాటు మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పేరు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. బాన్సువాడకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, పార్టీ నాయకులు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బాలరాజు, శివకుమార్ పేర్లను పరిశీలించినట్టు తెలిసింది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ పేరునే ప్రముఖంగా చెప్పినప్పటికీ, కొందరు ప్రజాప్రతినిధులు మామిండ్ల అంజయ్య, కైలాస్శ్రీనివాస్ పేర్లను కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నాయకులూ షబ్బీర్‌అలీ అనుచరులైనప్పటికీ ఆశావహులలో ఉన్నట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థిగా షెట్కారే! జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన పలువురు ఆశావహులు, నాయకులు, కార్యకర్తలు ఎంపీ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్ పేరునే ఏఐసీసీ పరిశీలకుని వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. మరో ఇద్దరు నేతల పేర్లు కూడా పరిశీలకుని వద్ద పేర్కొన్నప్పటికీ, జిల్లా నాయకులు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు నేతల పేర్లు పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కోసం జరిపిన అభిప్రాయంలో పరిశీలకుని వద్ద వెల్లడైనట్లు సమాచారం.