Suridu
-
సూరీడుపై హత్యాయత్నం
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): తన తల్లిదండ్రులపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సూరీడు కుమార్తె గంగాభవానీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో పోలీసులు బుధవారం సూరీడు అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీ హిల్స్ రోడ్ నంబరు 10లోని గాయత్రీహిల్స్‌లో నివసించే ఇ. సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడు కుమార్తె గంగాభవాని, డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి సురేంద్రనాథ్‌రెడ్డి తన మామ ఇంట్లోకి ప్రవేశించి, కర్రబ్యాటుతో సూరీడుపై వెనుక నుంచి దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడి చేశాడు. ఘటనలో గంగాభవానీకి కూడా గాయాలయ్యాయి. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సురేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. గంగాభవానీ ఫిర్యాదు మేరకు సురేంద్రపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. చదవండి: (బీఫార్మసీ విద్యార్థిని సుప్రియ ఆత్మహత్య) -
సూరీడుకి కూకట్పల్లి కాంగ్రెస్ టిక్కెట్?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావు మరోసారి తెరవెనుక చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడుకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు ఆయన పావులు కదుపుతున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. కూకట్పల్లి టిక్కెట్ సూరీడుకు ఇప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సూరీడును పోటీకి దించాలని ఆయన భావిస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌ను సూరీడు కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కాగా,తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వెనుక కేవీపీ హస్తముందని తెలిపింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ముందుగా జానారెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ఊహించనివిధంగా పొన్నాల తెరపైకి వచ్చారు. అయితే పొన్నాల నియామకం వెనుక తన ప్రమేయం ఉన్నట్టు వచ్చిన వార్తలను కేవీపీ ఖండించారు.