గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
మైలారం(వర్గల్): మెదక్ జిల్లా వర్గల్ మండలం మైలారం చెరువులో గల్లంతైన యువకుడు చంద్రకాంత్ మృతదేహం బుధవారం దొరికింది. పిట్టల కోసం చెరువులో దిగి మంగళవారం సాయంత్రం ధర్మారెడ్డిపల్లికి చెందిన సూర్పాటి చంద్రకాంత్(25) ప్రమాదవశాత్తు మునిగిపోయిన విషయం తెలిసిందే.
శవం కోసం రాత్రి వరకు వెతికినప్పటికి ఫలితం దక్కలేదు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గాలించగా చెరువులో ఓ పక్కన మృతదేహం దొరికింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించినట్లు గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు.