పాతబస్తీలో పోలీసుల కవాతు
చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు శనివారం పాతబస్తీలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. డీసీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ ఆదేశాల మేరకు ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్ ఏసీపీ డివిజన్ల పరిధిలో కవాతు జరిపారు. ఏసీపీలు, సీఐల ఆధ్వర్యంలో ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్, ఏపీఎస్పీ బలగాలు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట నుంచి ప్రారంభమైన కవాతులో ఇన్స్పెక్టర్లు అందె శ్రీనివాసారావు, ఎస్.మహేశ్వర్, షాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.