అడవి జంతువులపై వేటగాళ్ల కన్ను
బాన్సువాడ, న్యూస్‌లైన్ : అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వేటగాళ్లకు ఊతమిస్తోంది. అధికారుల పర్యవేక్షణ, ని ఘాలోపం కారణంగా బాన్సువాడ ప్రాంతంలో ని దట్టమైన అడవుల్లో వేటగాళ్లు మూగజీవుల ను సంహరిస్తున్నారు. హైదరాబాద్, మెదక్ జి ల్లాల నుంచి వస్తున్న వేటగాళ్లు యథేచ్ఛగా జం తువులను వేటాడుతున్నట్లు తెలుస్తోంది. వీరికి అటవీశాఖ అధికారులు సైతం సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం గ తంలో జరిగిన సంఘటనలే. ప్రస్తుతం ఎండ ప్రతాపం చూపుతుండడంతో అటవీ జంతువు లు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో వేట గాళ్లు అటవీ జంతువులను వేటాడుతున్నారు.
అంతరిస్తున్న అడవులు...
బాన్సువాడ అటవీశాఖ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, గాంధారి, పిట్లం, నిజాంసాగర్, వర్ని, సదాశివనగర్ మండలాల్లో గతంలో దట్టమైన అడవులు విస్తరించి ఉండేవి. ఈ అడవులు 15 ఏళ్ల క్రితం వరకు మావోయిస్టులకు అడ్డాగానూ ఉండేవి.
మావోయిస్టులు ఈ అడవుల్లోనే ఆశ్రయం పొందుతూ తమ కార్యకలాపాలను కొనసాగించే వారు. జిల్లాలోనే బాన్సువాడ ఆటవీ ప్రాంతానికి ఎంతో గుర్తింపు ఉండేది. ఈ అడవుల్లో ఉండే వివిధ రకాల జంతువులు కనువిందు చేసేవి. బడాపహాడ్ ప్రాంతంలో ఉండే నెమళ్లు, జింకలను చూసేందుకు హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేకంగా పర్యాటకులు వచ్చేవారు. అప్పట్లో జంతువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఆటవీశాఖలో బీట్ ఆఫీసర్లను నియమించి వాటిని సంరక్షించే బాధ్యతలను అప్పగించారు.
కొందరు అక్రమార్కుల కన్ను బాన్సువాడ ప్రాంతంలోని అటవీ ప్రాంతంపై పడడంతో ఆ తర్వాత అడవులు నరికివేతకు గురయ్యాయి. కలప స్మగ్లర్లు అర్ధరాత్రి వేళ బడాపహాడ్, జలాల్పూర్, గాంధారి, మొండి సడక్, చిల్లర్గి తదితర ఆటవీ ప్రాంతాల్లో ఉన్న కలపను యథేచ్చగా నరికి వేస్తూ జిల్లాకేంద్రానికి తరలించేవారు. వీరికి అటవీ శాఖ అధికారులు సైతం వత్తాసు పలకడంతో 1998 నుంచి 2002 వరకు వేలాది హెక్టార్లలో చెట్లు నరికివేతకు గురయ్యాయి. అడ్డుతగిలిన గ్రామస్తులపై దాడులు సైతం జరిగాయి. దీంతో దట్టమైన అడవి కాస్త చిట్టడివిగా మారింది.