suzanne
-
యాత్రలో జర్మనీ నటి సుజానే
‘యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రని జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహి వి. రాఘవ్ మాట్లాడుతూ–‘‘యాత్ర’కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందుతోంది. వైఎస్ జగన్‌గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘యాత్ర 2’ని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
సుజానే 400 కోట్లు అడగలేదు
విడాకుల సమయంలో తనకు 400 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ సుజానే డిమాండ్ చేసిందని వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని, అవన్నీ కట్టుకథలని హృతిక్ రోషన్ కొట్టిపారేశాడు. ఈ కథనాలపై తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వెళ్లగక్కాడు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మీడియాలో హృతిక్ - సుజానేల విడాకుల విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, సుజానే అంటే ఇప్పటికీ తనకెంతో ప్రేమ అని హృతిక్ అంటున్నాడు. పదమూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీళ్లు ఇటీవలే విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమ విడాకుల విషయంలో, ఆమె భరణం కోరినట్లు వస్తున్నవన్నీ కట్టు కథలని, తన ఇష్టసఖిని బద్నాం చేస్తున్నారని అన్నాడు. తన సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డాడు. Fabricated news articles. Demeaning my loved ones. Testing my patience — Hrithik Roshan (@iHrithik) July 30, 2014