1.5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు
మావకరపాలెం, న్యూస్‌లైన్: జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షా 5వేల 507మందికి శస్త్రచికిత్సలు జరిగాయని ఆ పథకం జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్.వి.పార్వతీశం తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాన్ని పరి శీలించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు సర్జరీలకు రూ.269.83 కోట్లు ఖర్చయ్యాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 1,523 వైద్యశిబిరాల్లో వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యనిపుణులు 2లక్షల 89వేల 112 మంది రోగులకు వై ద్యపరీక్షలు నిర్వహించారన్నారు.
వీరిలో 16,798 మందిని ఈ శిబిరాల్లో గుర్తించి మెరుగైన వైద్య సేవలందించామన్నారు. జిల్లాలో నెలకు నాలుగు శి బిరాలు ఏర్పాటుచేసి రో గులకు వైద్యసేవలు అం దిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ప్రత్యే క శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. శస్త్రచికిత్సలకు సంబంధించిన బిల్లులను సకాలంలో ఆస్పత్రులకు చెల్లిస్తున్నామన్నారు. రోగుల పేర్లు తప్పుగా నమోదు చేస్తే అలాంటి వారి బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో స్థానిక ఆరోగ్యమిత్ర మేరీ జీవాబాయి పాల్గొన్నారు.