Swadeshi Jagran Manch
-
ఎయిర్ ఇండియా సీఈఓను వెంటనే తొలిగించాలి: ఆర్ఎస్ఎస్
గత కొద్ది రోజుల క్రితం ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు మీటింగ్‌లో కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. టర్కీలో తన మునుపటి రాజకీయ సంబంధాలను ఉటంకిస్తూ.. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్‌గా ఇల్కర్ ఐసీ నియామకాన్ని అడ్డుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్'గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఉన్న ఇల్కర్ ఐసీని తన బ్యాగ్ గ్రౌండ్ చెకింగ్ క్షుణ్ణంగా దర్యాప్తు చేయలని ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని కోరింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఐసీ ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల 2.4 బిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న విమానయాన సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా సీఈఓగా ఐసీని నియమించింది. ఆర్ఎస్ఎస్ ప్రకటనపై టాటా గ్రూప్ కూడా స్పందించలేదు. స్వదేశీ జాగరణ్ మంచ్ సహ కన్వీనర్ అశ్వనీ మహాజన్ మాట్లాడుతూ.. టర్కీ భారత ప్రత్యర్థి పాకిస్తాన్ పట్ల సానుభూతితో ఉన్నందున ఐసీ నియామకాన్ని ప్రభుత్వం ఆమోదించరాదని అన్నారు. భారతదేశంలో ఒక విమానయాన సంస్థకు సీఈఓగా విదేశీ జాతీయుడి నియమించడానికి ముందు ప్రభుత్వ క్లియరెన్స్ అవసరం అని ఆయన అన్నారు. (చదవండి: ముఖం మీద పిడిగుద్దులు పడుతున్నా.. చిరునవ్వుతో!) -
చైనా కంపెనీలు, ఉత్పత్తులను నిషేధించాలి
న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్ - చైనా ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ (ఎస్జేఎమ్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన సైనికులకు నివాళిగా ప్రభుత్వం చేపట్టే టెండర్లలో చైనా కంపెనీలు పాల్గొనకుండా నిషేధం విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించింది. బుధవారం ఎస్జేఎమ్ కో కన్వీనర్ అశ్వని మహాజన్ మాట్లాడుతూ.. నటీనటులు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు సైతం చైనా ఉత్పత్తులను ప్రోత్సహించవద్దని కోరారు. (సరిహద్దు వివాదం : డ్రాగన్ కుయుక్తి) కాగా మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రెండు దేశాల మధ్య చర్చలు మేనేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించడం ప్రారంభించాయి. ఇదే సమయంలో సోమవారం రాత్రి లడఖ్‌లో భారత్-చైనా ఆర్మీ మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు తలెత్తాయి. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. చైనాకు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. ( విషం చిమ్మిన చైనా ) -
‘భూ’ఆర్డినెన్స్‌పై నిరసనలు
న్యూఢిల్లీ: భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ అమానుషమైందని, రైతుల జీవితాల్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తుందని వామపక్ష రైతు సంఘాలు విమర్శించాయి. తాజా ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని సీపీఐ, సీపీఎంలకు చెందిన రైతు సంఘాలైన అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) (రెండు పార్టీల సంఘాలకూ ఒకే పేరు) నేతలు హన్నామ్ మొల్లా, అతుల్ కుమార్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాగా, ఆర్ఎస్ఎస్ ఆర్థిక విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం) కేంద్ర తాజా ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. దీన్ని అమలు చేసేముందు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. ప్రధానంగా యూపీఏ ప్రభుత్వం భూసేకరణచట్టంలో పొందుపరిచిన ఆహారభద్రతా ప్రమాణాలు, సామాజిక ప్రభా వ అంచనాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎస్జేఎం వ్యతిరేకించింది.