ముగిసిన పెద్దగట్టు జాతర
వైభవంగా మకరతోరణం తరలింపు
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర (పెద్దగట్టు) ముగిసింది. గురువారం యాదవపూజారులు మకరతోరణం తరలింపు కార్యక్రమం నిర్వహించారు. జాతరకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి యాదవ కులస్తులతోపాటు, ఇతర భక్తులు తండోప తండాలుగా వచ్చారు. ఐదురోజుల్లో సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఐదు రోజుల పాటు కళకళలాడిన దురాజ్‌పల్లి, సూర్యాపేట ప్రాంతాలు గురువారం భక్తులు తిరుగుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతున్నాయి.