హర్యానా ఎన్నికల బరిలో సుష్మా సోదరి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సోదరి వందన శర్మ హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. శనివారం రాత్రి బీజేపీ 47 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలకు, ఓ మాజీ మంత్రికి జాబితాలో చోటు దక్కింది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై జాబితాను ఖరారు చేసింది. దీంతో హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు బీజేపీ తరపున అభ్యర్థులను ఎంపిక చేసినట్లయింది. హర్యానాలో వచ్చే నెల 15న ఎన్నికలు జరగనున్నాయి.