Swimmer Isui mithay
-
మరో స్వర్ణం గెలిచిన ఇష్వి
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ ఇష్వి మతాయ్ మెరిసింది. హన్మకొండలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం ఇష్వి అండర్– 14 కేటగిరీ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ రేసులో నిమిషం 25 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలిచింది. తొలి రోజు ఇష్వి 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ రేసులో బంగారు పతకం, ఫ్రీస్టయిల్ 50 మీటర్ల రేసులో కాంస్య పతకాన్ని సాధించింది. తాజా ప్రదర్శనతో ఇష్వి ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. -
రెండు స్వర్ణాలు నెగ్గిన ఇష్వి
రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్ ఇష్వి మిథాయ్ మరో రెండు స్వర్ణాలు సాధించింది. కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో చివరి రోజు ఇష్వి గ్రూప్-3 బాలికల 50 మీటర్ల బ్యాక్టక్,ర 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాలు గెలిచింది. తొలి రోజు ఇష్వి 100 మీటర్ల బ్యాక్టక్ విభాగంలోనూ పసిడి పతకం సాధించింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఇష్వి మూడు స్వర్ణాలతో తన సత్తాను చాటుకుంది.