స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే మాస్టర్ డెవలపర్
హైదరాబాద్: కొత్త రాజధానిలోని ప్రధాన నగరం (సీడ్ కేపిటల్) కోసం.. కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ) ఆధ్వర్యంలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను స్విస్ చాలెంజ్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనుభవమున్న డెవలపర్స్ తమ ప్రతిపాదనలను పురపాలక పట్టణాభివద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి పంపించాల్సి ఉంటుందని, ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలిస్తుందని వివరించారు. వివరాలకు పురపాలక పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించాలని, ప్రతిపాదనలు ఞటట్ఛఛిడఝ్చఠఛీః్చఞ.జౌఠి.జీ మెయిల్‌కు పంపచ్చునని తెలిపారు. ఈ ప్రక్రియను కొనసాగించడానికి ఎలాంటి వ్యవస్థ లేదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీసీడీఎంసీని ఏర్పాటు చేస్తూ శనివారం జీవో జారీ చేసింది.