మహానగరంలో మహావర్షం!
ముంబై ఒకప్పుడు షాంఘై, హాంకాంగ్ లేదా సింగపూర్‌గా మారాలని కలలు కనేది. కానీ నగర నిర్వహణను సమర్థంగా చేపట్టాలని ఎవరూ భావించనందున, అది ముంబైలాగే ఉండిపోవాలనుకున్నట్లుంది. స్విట్జర్లాండ్‌లో రైలు గమ్యస్థానం చేరుకుని ప్లాట్‌ఫాంపై ఆగివున్నట్లు నిర్ధారించుకోకుండానే, ప్రయాణికులు తమ గడి యారంకేసి చూసు కుంటూ రైల్లోంచి దిగే వారని చెబుతుంటారు. స్విస్ రైల్వేకి అంత సామర్థ్యం ఉండేది కాబట్టే రైలు రాకపోకలపై అంత స్పష్టమైన అంచనా ఉండేది. ఏదేమైనా, ఒక దేశ విశిష్ట లక్షణం గురించి మంచిగా లేదా చెడుగా ఈ స్థాయిలో వర్ణించడంవల్ల ఆ వర్ణనలో ఎంతో కొంత అతిశయోక్తి ఉండే ఉంటుంది.
ముంబై నగరంలో వర్షం కురుస్తోందని తెలు సుకోవడానికి మీరు వర్షంలో తడవవలసిన అవసరం లేనే లేదు. నగరం స్థితి, ప్రత్యేకించి అస్తవ్యస్తంగా మారిన నగర జీవితం మీకు ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. రహదారులు పొంగి పొరలుతాయి. రైలు పట్టాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. పైగా, ప్రతి ఏటా తన రాకకు గుర్తుగా వర్షం నగరాన్ని గుంతలమయం చేస్తుంది. కొద్ది రోజుల్లోనే అవి పెద్ద పెద్ద నీటి బిలాలుగా మార తాయి. అయితే ఇది మాత్రం అతిశయోక్తి కాదు.
భూమ్మీది నుంచి చంద్రుడిపైకి వెళ్లి ఆ గ్రహంపై నడిచిన తొలి మానవుడిగా చరిత్రకెక్కిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆయన తర్వాత అక్కడికి వెళ్లిన ఇతర రోదసీ యాత్రికులు అక్కడ తమకు తార సపడిన బిలాల కారణంగా చంద్రుడిని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. అయితే ముంబైలోని బిలాలు చంద్రుడిమీదలాగా శాశ్వతంగా ఉండకపో యినా, స్విస్ రైలులాగా ప్రతి వర్షరుతువులోనూ క్రమం తప్పకుండా నగరంలో కనిపిస్తుంటాయి.
ఇలాంటి పరిస్థితులకు అలవాటుపడక తప్ప దని ముంబై వాసులు ఇప్పటికే ఒక అభిప్రాయా నికి వచ్చేసినప్పటికీ, ముంబై ఏదో ఒక నాటికి భారతీయ వెనిస్ నగరంగా మారుతుందని వారు తరచుగా జోకులేసుకుంటున్నప్పటికీ, దీంట్లో గర్వ పడాల్సిందేమీ లేదు. నగరంలో కార్లకు బదులుగా పడవలు ఉండవచ్చు. నీటి గుంతలకు బదులుగా ప్రతిచోటా నీరే ఉండవచ్చు. నగర వాసుల ఆరా టాన్ని శాంతపర్చేందుకు వర్షాకాలంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు.
దైనందిన వ్యవహారాలను సంక్లిష్టం చేస్తున్న నగరం తక్షణ స్వభావం ఇదే మరి. ఏడు దీవులను వేరు చేస్తున్న చిత్తడి నేలలనుంచే నగరంలో చాలా భాగం నివాస యోగ్యంగా మారింది. ముంబై నగరంలో చాలా భాగం సముద్ర మట్టానికి కేవలం అయిదు మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది. నగ రానికి జీవధాతువుగా నిలిచిన రైలు పట్టాలు కాస్త ఎత్తులో ఉంటున్నాయి. వర్షం, సముద్రం పోటు రెండూ కాకతాళీయంగా ఒకేసారి వస్తే, యథా విధిగా నగర జీవితం విచ్ఛిన్నమవుతుంది. వర్షపు నీరు అలా సముద్రంలోకి సజావుగా వెళ్లిపోలేదు.
ప్రతి వర్షరుతువూ తక్కువ ప్రదేశంలో అతి వృష్టికి దారితీయదు. అతివృష్టి అంటే ఏమిటి? ముంబై నగరంపై కొన్ని కిలోమీటర్ల పొడవునా వర్ష మేఘం నిలువునా ఏర్పడి ఏకధాటిగా వర్షం కురు స్తుంది. దాని వెంటనే వరద పోటెత్తుతుంది. 2005 జూైలై 25న ఇలాగే జరిగింది. మురికికాలువ ఎలా ఉండాలని తాను భావిస్తోందో అస్సలు బోధపడని నగరం ముంబై. నగరంలోని కాలువలను ఆక్రమ ణలు అడ్డుకోవటంతో వాటి వైశాల్యం కుదించుకు పోయింది. నిజానికి అది ఒకప్పుడు మిథీ నది. ఒక నది కాలువగా మారిపోవడమే విచిత్రం మరి.
ఇంకా ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటంటే, ఈ కాలువలు పూర్తిగా పూడిపోయాయి అన్నట్లుగా నగరవాసులు నానా చెత్తనూ వాటిలోకి విసిరేస్తుం టారు లేదా నగర మురికివాడల నుంచి రైలు పట్టాల పొడవునా చెత్త పోగేస్తుంటారు. ఈ మురికి వాడలకు, పట్టాలకు మధ్యన ఉన్న గోడలు మాత్రమే వీటిని వేరుచేస్తుంటాయి.
రైల్వే శాఖ పథకం ప్రకటించి డబ్బు ఖర్చు పెడుతుంది. కానీ వర్షం రాకముందే, పట్టాలపై పూర్తిగా చెత్త పేరుకుపోతుంది. దీంతో నీరు పారే మార్గాలు మూసుకుపోతాయి. ఈ సంక్షోభానికి వివేకరహితంగా తమవంతు దోహదం చేసే నగర పౌరులు కూడా ‘మన నగరం ఎలా నడుస్తుందో చూడండి’ అంటూ శోకన్నాలు తీస్తుంటారు.
ఇలాంటి వాతావరణంలో కార్లను వినియో గించేవారినే నీటి గుంతలు ఇబ్బందిపెడుతుం టాయి. ఇతర ప్రజానీకం లేదా సగటు పౌరులకు రైలు సర్వీసులు సజావుగా కొనసాగితే చాలు పనికి వెళ్లి తిరిగి వచ్చే వెసులుబాటు ఉంటుంది. ఈ నీటి గుంతలు కాంట్రాక్టర్ల నాసి రకం పనులను తేట తెల్లం చేస్తాయి. గత మూడేళ్లుగా వారికి అప్ప గించిన పనులకేసి చూస్తే వీరు మోసానికి పాల్ప డుతూనే ఉన్నారని స్పష్టమవుతుంది. కాంట్రాక్టర్ల విశ్వాసఘాతుకం పట్ల నిఘా పెట్టని నగర పాలనా యంత్రాంగం నిర్వాకం వల్ల వీరి హవా నడుస్తూనే ఉంటుంది. ఈ జూదంలో కాంట్రాక్టర్లు మాత్రమే కాదు.. నగర బాధ్యతలు చూస్తున్న రాజకీయ నేతలు, అధికారులు కూడా డబ్బు చేసుకుంటూనే ఉంటారు.
ముంబై ఒకప్పుడు షాంఘై, హాంకాంగ్ లేదా సింగపూర్‌గా మారాలని కలలు కనేది. కానీ నగర నిర్వహణకు సంబంధించిన భారీ కృషిని సమ ర్థంగా చేపట్టాలని అది కోరుకోనందున, అది ముంబైలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్న ట్లుంది. ఇదేమంత చెడ్డ విషయం కూడా కాదు. ఎందుకంటే ఇతర మహా నగరాలతో ముంబై తన్ను తాను పోల్చి చూసుకున్నట్లయితే, కారణం లేకుండా తమకు ప్రతిరూపంగా పోల్చుకుంటు న్నందుకు ఆ మహానగరాలు ముంబైపై దావా వేసినా వేయవచ్చు. కాబట్టి ప్రతి వర్షరుతువు లోనూ ఒకే తీరుతో ఉంటున్న ముంబైని నగర వాసులు ప్రేమించాలా? లేక ఈ మహా నగరానికి ఆ దుస్థితి కలిగిస్తున్నందుకు రుతువపనాలను ద్వేషించాలా? ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు పట్టించుకుంటారు?
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
- మహేష్ విజాపుర్కార్
ఈమెయిల్: mvijapurkar@gmail.com