వైట్నర్ తాగితే ఆగడు
► 6 నెలల్లో 13 చోరీలు
► చోరీ సొత్తుతో లాటరీ టికెట్ల కొనుగోలు
► ఘరానా దొంగ అరెస్టు
కుత్బుల్లాపూర్: అతనో ఘరానా దొంగ వైట్నర్ తాగాడంటే ఏదో ఒక ఇళ్లు కొళ్లగొట్టాల్సిందే. చోరీ సొత్తుతో లాటరీ టిక్కెట్లు కొని అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. తాగుడుకు బానిసై దొంగతనాలు, హత్యలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా అదే పంథాను అనుసరిస్తున్న పాత నేరస్తుడిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రంగారెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. నాందేడ్‌కు చెందిన సయ్యద్ అజీజ్ నగరానికి వలసవచ్చి సూరారం కాలనీ ఓం జెండా వద్ద ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగించేవాడు.
గతంలో అతనిపై పలు పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీ కేసులు ఉన్నాయి జీడిమెట్ల పోలీసులు అతడిని అరెస్టు చేసి పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు. గత డిసెంబర్లో బయటికి వచ్చిన అబ్బాస్ఆరు నెలల వ్యవధిలో జీడిమెట్ల పరిధిలో 6, పేట్ బషీరాబాద్ పరిధిలో 6, చందానగర్ ఒక దొంగతనానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం గోదావరి హోమ్స్ వద్ద పోలీసులు అబ్బాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అతడి నుంచి 32 తులాల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.