17,950 కోట్లతో ‘యాదాద్రి’
* దామరచర్లలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం
* బీహెచ్ఈఎల్, టీ.జెన్కోల మధ్య కుదిరిన ఒప్పందం
* వివరాలను వెల్లడించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘యాదాద్రి’ థర్మల్ విద్యుత్కేంద్రాన్ని నిర్మించేందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరింది.
సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం సచివాలయంలో జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య చర్చలు జరిగాయి. రూ.17,950 కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి ప్రాజెక్టును నిర్మించేం దుకు బీహెచ్ఈఎల్ సమ్మతించింది. చర్చల అనంతరం జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, బీహెచ్ఈఎల్ చైర్మన్ ప్రసాదరావుతో కలసి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 5 థర్మల్ పవర్ ప్లాంట్లను దామరచర్లలో నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ర్టవ్యాప్తంగా నిర్మిస్తున్న దాదాపు 6వేల కోట్ల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.27,367 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు.