ముట్టడి...కట్టడి
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమం రసాభాసగా మారింది. కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు య త్నించిన ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అ డ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. లాఠీచార్జిలో పలువురు కార్యకర్తలు గా యపడ్డారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన బీజేపీ నాయకులు, కా ర్యకర్తలు తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడినుంచి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు ప్ర యత్నించారు.
ఇంతలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజే పీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.ఆచారి మా ట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం పేద వి ద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేద విద్యార్థులను విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తున్నార ని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప తనమైతేనే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా క ళ్లు తెరిచి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోతే ఆందోళనలను ఉ ధృతం చేస్తామని హెచ్చరించారు.
కొంతమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు క లెక్టరేట్లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు లాఠీలకు పనిజెప్పడంతో పలువురు గా యపడ్డారు. వారిని పోలీసులు అరెస్ట్‌చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకురాలు పద్మజారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.రతంగపాండురెడ్డి, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు కొండయ్య, కె.రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి పడాకుల బాలరాజు, మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు రామేశ్వరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పాలాది రాంమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.