స్పిన్నర్ లియోన్‌కు పిలుపు
► చివరి రెండు వన్డేలకు ఆసీస్ జట్టు
► టి20లకు టెయిట్, వాట్సన్
మెల్బోర్న్: భారత్‌తో మిగిలిన రెండు వన్డేలు ఆడే ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లియోన్‌కు చోటు దక్కింది. పేసర్ పారిస్ స్థానంలో లియోన్ 13 మంది సభ్యుల జట్టులోకి వచ్చాడు. 2014లో చివరిసారి వన్డే ఆడిన లియోన్... ప్రస్తుత సీజన్ బిగ్‌బాష్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. 20, 23 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయి. వన్డే జట్టులో స్థానం కోల్పోయిన షేన్ వాట్సన్‌తో పాటు షాన్ టెయిట్ కూడా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికయ్యారు. భారత్‌తో సిరీస్‌కు అనేక మంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసిన సెలక్టర్లు బెయిలీ, మిషెల్ మార్ష్‌లను ఎంపిక చేయలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఏకంగా 17 మందితో జట్టును ప్రకటించడం విశేషం.
ఆస్ట్రేలియా టి20 జట్టు: ఫించ్ (కెప్టెన్), బోలాండ్, బోయ్స్, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, హెడ్, నాథన్ లియోన్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, స్టీవ్ స్మిత్, కేన్ రిచర్డ్సన్, షాన్ టెయిట్, ఆండ్రూ టై, మ్యాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్.