Taj Hotels
-
టాటా గ్రూప్‌లో ఆశా కిరణం లియా టాటా!
పెదనాన్న రతన్ టాటా బాటలో టాటా గ్రూప్ లో తనదైన ముద్ర వేస్తున్నారు లియా టాటా. రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా పెద్ద కుమార్తె ఈ లియా టాటా. మంచి విద్యా నేపథ్యం, బిజినెస్ కెరియర్‌తో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.విద్యా నేపథ్యంటాటా గ్రూప్‌లో తనదైన అద్భుత కెరీర్‌ను ఏర్పరుచుకుంటున్న లియా టాటాకు బలమైన విద్యా నేపథ్యం ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ప్రతిష్ఠాత్మక ఐఈ బిజినెస్ స్కూల్ లో మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె కార్పొరేట్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సమకూర్చుకున్నారు.తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా 2006లో తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు లియా టాటా. కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తాజ్ హోటల్స్ లో డెవలప్ మెంట్ అండ్ ఎక్స్ టెన్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హోటల్ కంపెనీలో భాగమైన లగ్జరీ హోటల్ చైన్ వృద్ధి, వ్యూహాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.టాటా గ్రూప్‌లో కీలక పాత్రఇండియన్ హోటల్ కంపెనీలో అంతర్భాగమై, దాని కార్యకలాపాలు, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు లియా టాటా. ఈ ఇండియన్ హోటల్ కంపెనీ ప్రఖ్యాత తాజ్ హోటల్స్‌తో సహా టాటా గ్రూప్ హోటళ్ళ విస్తృతమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంది. బ్రాండ్ శ్రేష్ఠత, ఆతిథ్యం వారసత్వాన్ని కొనసాగించడంలో లియా టాటా కృషి గణనీయంగా ఉంది.తాజ్ హోటల్స్ లో బాధ్యతలతో పాటు, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనకు అంకితమైన టాటా గ్రూప్ విభాగమైన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా లియా టాటా కొనసాగుతున్నారు. 2022 నవంబర్‌లో జరిగిన ఈ నియామకం ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన దశ. సంస్థలో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న లియా టాటాకు ఆమె వృత్తిపరమైన ప్రయాణానికి రతన్ టాటా మార్గనిర్దేశం చేస్తున్నారు. -
తాజ్ హోటల్స్‌పై సైబర్ అటాక్ - ప్రమాదంలో 15 లక్షల మంది డేటా!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ 'ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా'(ఐసీబీసీ) మీద జరిగిన సైబర్ దాడి మరువకముందే.. టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 2023 నవంబర్ 5న తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు, తాజ్ హోటల్‌కు చెందిన సుమారు 15 లక్షల మంది డేటాను హ్యాక్ చేసినట్లు తెలిసింది. నిందితులు ఈ డేటాను తిరిగి ఇవ్వాలంటే 5000 డాలర్లు డిమాండ్ చేస్తూ కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది. వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని.. దీనిపైనా సమగ్ర పరిశీలను జరుగుతోందని, డేటా గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. Dnacookies అనే పేరుతో హ్యాకర్లు కస్టమర్ల డేటాను హ్యాక్ చేసినట్లు, ఇప్పటికి ఈ డేటాను ఎవరికీ ఇవ్వలేదని వెల్లడించారు. కస్టమర్ ఐడీ, అడ్రస్ వంటి ఇతర వ్యక్తిగత సమాచారాలను వారు హ్యాచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కస్టమర్ డేటా 2014 నుంచి 2020 వరకు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. ఈ సంఘటనపై ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్) ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అధికారులకు కూడా ఇప్పటికే తెలియజేసినట్లు స్పష్టం చేశారు. -
ప్రేమికులకు తాజ్ హోటల్ బంపర్ ఆఫర్?
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే ఈ వాలంటైన్స్ డే సందడి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్లు ప్రియురాలికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి? ఎక్కడకు తీసుకెళ్లాలి? అని ప్లానింగ్స్ వేస్తుండగా.. ఇంకా ఇప్పుడే ప్రేమలో దిగుతున్నవాళ్లు నచ్చిన అమ్మాయి మనసు ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేమించినవాళ్లను సర్ప్రైజ్ చేసేందుకు ఏం చేయాలా? అని గూగుల్ తల్లిని అడుగుతున్న క్రమంలో ఓ మెసేజ్ చాలామందిని ఆకర్షిస్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా తాజ్ హోటల్ మీకో బంపర్ ఆఫర్ ఇస్తోందంటూ యూత్‌ను ఊరిస్తోంది. (చదవండి: 7 లక్షల మందికి వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అన్న బిల్‌గేట్స్?) "ఇప్పుడే నేను తాజ్ గిఫ్ట్ కార్డ్‌ను గెల్చుకున్నాను. తద్వారా తాజ్ హోటల్లో ఏడు రోజుల పాటు ఉచితంగా ఉండే అవకాశం లభించింది. మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి" అంటూ ఓ లింక్ కనిపిస్తోంది. దీన్ని క్లిక్ చేయగానే 'మీరు కరెక్ట్ గిఫ్ట్ బాక్స్‌ను ఎంపిక చేసుకుంటే తాజ్ హోటల్లో నివసించే ఛాన్స్ మీ సొంతం, గుడ్ లక్' అని ప్రత్యక్షమవుతుంది. మళ్లీ ఓకే నొక్కగానే అక్కడ చిన్న ప్రశ్నలేవో అడుగుతుంది. వాటికి సమాధానం చెప్పిన వెంటనే స్క్రీన్ మీద పన్నెండు గిఫ్ట్ బాక్సులు ప్రత్యక్షమవుతాయి. వీటిలో ఏదైనా క్లిక్ చేసినప్పుడు గిఫ్ట్ కార్డు గెలుచుకున్నారే అనుకోండి. దాన్ని ఓ ఐదు వాట్సాప్ గ్రూపులకు లేదా 20 మందికి షేర్ చేయమని అడుగుతుంది. అవన్నీ పూర్తి చేశాక కథ మళ్లీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇదో ఫేక్ మెసేజ్. ఈ వైరల్ మెసేజ్‌పై తాజ్ హోటల్ స్పందిస్తూ ప్రేమ జంటల కోసం తాము ఎలాంటి గిఫ్ట్ కార్డులు పంపించడం లేదని స్పష్టం చేసింది. కాబట్టి మీకు కనక ఆ మెసేజ్ ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే తాజ్ హోటల్లో ఏడు రోజులు ఉచితంగా గడపొచ్చని కలల్లో తేలిపోకండి. అదంతా ఓ మోసమని ఇతరులకు తెలియజేయండి. (చదవండి: దంపతుల డ్యాన్స్.. మనసు దోచేయడం ఖాయం) -
ఇక బ్రాండ్ ‘తాజ్’ ఒక్కటే!
ఇండియన్ హోటల్స్‌కు కొత్తరూపు.. • ఆతిథ్య సేవలన్నీ ఒకే బ్రాండ్ పేరుతో • ఒక్కటి కానున్న తాజ్ హోటల్స్, ప్యాలసెస్, రిసార్ట్స్, సఫారీస్ • గేట్‌వే, వివాంటా హోటళ్లూ తాజ్ కిందకు • డిసెంబర్ నాటికి ప్రక్రియ పూర్తి ముంబై: టాటాగ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) పునర్నిర్మాణ ప్రక్రియ దిశగా చర్యలు ప్రారంభించింది. తన పరిధిలోని అన్ని హోటల్స్‌ను ‘తాజ్ హోటల్స్ ప్యాలసెస్ రిసార్ట్స్ సఫారీస్’ పేరుతో ఒకే బ్రాండ్ కిందకు తీసుకురానున్నట్టు ఐహెచ్‌సీఎల్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తాజ్ హోటల్స్, తాజ్ ప్యాలసెస్, తాజ్ రిసార్ట్స్, తాజ్ సఫారీస్ అనే నాలుగు విభాగాలతో భిన్నమైన ఆతిథ్య సేవలు అందిస్తుండగా... ఇవన్నీ తాజ్ బ్రాండ్ కిందకు రానున్నాయి. నూతనంగా ఏర్పడే బ్రాండ్ స్వరూపం తాజ్ వారసత్వాన్ని గౌరవించే విధంగా, గొప్ప బ్రాండ్‌గా ఉంటుందని, తమ వాటాదారులకు గణనీయమైన విలువను తెచ్చిపెడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా వివాంటా, గేట్‌వే పేర్లు కనుమరుగవుతాయి. దేశంలోనూ, దేశం వెలుపల ఉన్న వివాంటా, గేట్‌వే హోటళ్లన్నీ తాజ్ బ్రాండ్ కిందకు వస్తాయని తాజ్ హటల్స్ ప్యాలసెస్ రిసార్ట్స్ సఫారీస్ సీఈవో, ఎండీ రాకేశ్ సర్నా గురువారం ముంబైలో విలేకరులకు తెలిపారు. పునర్నిర్మాణ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ నాటికి ముగుస్తుందన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఇండియన్ హోటల్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 64 చోట్ల 101 ప్రదేశాల్లో హోటళ్లు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద హోటళ్ల గ్రూపుగా ఇది కొనసాగుతోంది. ఎనిమిదేళ్ల క్రితమే ప్రారంభం... గేట్‌వే, వివాంటా పేరుతో ఎనిమిదేళ్ల క్రితమే హోటల్స్ ప్రారంభం అయ్యాయి. దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీనిచ్చే వ్యూహంలో భాగంగా ఐహెచ్‌సీఎల్ ఈ బ్రాండ్ల పేరుతో హోటళ్లను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అయితే, ఇవి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ రెండు బ్రాండ్ల కింద అందిస్తున్న సేవల విషయమై కస్టమర్లలో అవగాహన లేదని ఐహెచ్‌సీఎల్ ఉద్యోగి ఒకరు స్వయంగా పేర్కొనడం గమనార్హం. తాజా ఏకీకరణ చర్యలతో దేశీయంగా అతిపెద్ద ఆతిథ్య బ్రాండ్‌గా తాజ్ నిలుస్తుంది. ప్రధానంగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు, లాభాలను గడించడం, తాజ్ బ్రాండ్‌కు మరింత బలాన్ని తీసుకొచ్చేందుకు ఐహెచ్‌సీఎల్ తాజా చర్యలను చేపట్టినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.