Takkallapalli Ravinder Rao
-
‘పౌరుషం ఉంటే కొండా సురేఖపై పోటీ చేసి గెలువు’
సాక్షి, వరంగల్ : ఎర్రబెల్లి దయాకర్ రావుకు పౌరుషం ఉంటే కొండా సురేఖపై పోటీ చేసి గెలవాలని ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కొండా దంపతులు ఆగర్భ శత్రువులు అని చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలవాలన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే పాలకుర్తి నియోజకవర్గ టికెట్‌ను కోరుతున్నానన్నారు. దయాకర్‌రావుకు పాలకుర్తి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం పట్ల పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. దయాకర్ రావు పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందుకలు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం పాలకుర్తి టికెట్ ఇవ్వకపోతే కార్యకర్తల అభీష్టం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. -
93 మంది అమరుల కుటుంబాలకు సాయం
హన్మకొండసిటీ : తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కు టుంబాలను ఆదుకుంటామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిల బెట్టుకున్నారని టీఆర్ఎస్ జిలా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. హన్మ కొండ రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాల యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రత్యేక రాష్ర్టం కోసం ఎంతోమం ది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలకు పా ల్పడ్డారని గుర్తుచేశారు. అయితే స్వరాష్ర్టం కోసం ప్రాణత్యాగాలకు కూడా వెనకాడ ని అమరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారన్నారు. తమ ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం ఒక్కొక్కరి కి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసా యం మంజూరు చేశారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 93 మంది అమరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.9.03 కోట్ల సాయం అందించనుందని తెలిపా రు. తొలివిడత జాబితా లో పేర్లు లేనివారి వివరాలను టీఆర్ఎస్ కార్యాలయం లో, కలెక్టర్ కార్యాలయంలో త్వరలో అం దించాలని కుటుంబసభ్యులకు సూచిం చారు. అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు త్వరలో ఇళ్లు, అర్హత కలిగి వారికి ఉద్యోగం, భూమి లేని వారి కి భూమి ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని ఆయన పేర్కొన్నారు. ‘ఎర్రబెల్లి’కి మతిభ్రమించింది.. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జిల్లా పరిషత్ వేదికపై అర్థంలేని వ్యాఖ్యలు చేయడం ఆయ న దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. మచ్చలేని నాయకుడు వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిపై విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కన్నెబోయిన రాజయ్యయాదవ్ మాట్లాడు తూ ఎమ్మెల్యే దయాకర్‌రావు కాలుకాలిన పిల్లిలా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎంపీ కడియం శ్రీహరి పై వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన అల్పబుద్ధికి నిదర్శనమన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని, మీ ఆశీర్వాదాలు ఉండాలని కడియం శ్రీహరికి ఫోన్ చేసింది నిజం కాదా అని నిలదీశారు. తమ పార్టీ నేతలపై వచ్చిరాని మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో టీజేఏ రాష్ట్ర అధ్యక్షు డు మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, నాయకులు భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, నయీముద్దీన్, జోరిక రమేష్, బన్నే రాజేం దర్, రమేష్ పాల్గొన్నారు. -
తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ అంతర్భాగం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు నేడు ‘తెలంగాణ జాగృతి’ కవిత, రాష్ట్ర మంత్రి ‘ఈటెల’ జిల్లాకు రాక హన్మకొండ సిటీ : తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ అంతర్భాగమని టీఆర్ఎస్ జిలా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాల యం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి బతుకమ్మ కొత్తరూపును తీసుకురావడమే కాకుండా సంస్కృతిలో అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా పర్యటనకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం ఇక్కడికి వస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి ఉదయం 9.30 గంటలకు హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకున్న తర్వాత దుగ్గొండి, నర్సంపేట, కొత్తగూడ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని వివరించారు. తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉదయం 9 గంటలకు భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. తర్వాత హన్మకొండ శ్యామలా గార్డెన్సలో ఏర్పాటు చేసిన తెలంగా ణ జాగృతి జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సాయంత్రం 6.00 గంటలకు హన్మకొండ మర్కజీ స్కూల్ వద్ద తెలంగాణతల్లి విగ్రహం నుంచి నిర్వహించే బతుకమ్మ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు వీరమ్మ, టీఆర్ఎస్ నాయకులు లింగంపల్లి కిషన్‌రావు, అంజయ్య, జోరిక రమేష్, బండి రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.