తాలిబన్ చెరనుంచి బయటపడ్డ ప్రేమ్ కుమార్
ఎట్టకేలకు అఫ్గనిస్థాన్ తాలిబన్ చెరనుంచి ప్రముఖ భారతీయ క్రైస్తవ మతాచార్యుడు అలెక్సీస్ ప్రేమ్ కుమార్ బయటపడ్డాడు. గత ఎనిమిది నెలలుగా వారి బందీలో ఉన్న అలెక్సీస్ ప్రేమ్ కుమార్ను వదిలేశారు. క్రైస్తవులను ఎలాంటి సమస్యల నుంచైనా రక్షించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వారంలోపే అలెక్స్ బయటపడటం గమనార్హం.
తమిళనాడులోని శివగంగా జిల్లాకు చెందిన ఫాదర్ అలెక్సిస్ ప్రేమ్ కుమార్ అఫ్గనిస్ధాన్లో అంతర్జాతీయ జెస్యూట్ నిరాశ్రయుల స్వచ్ఛంద సేవా సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనను గత జూన్ 2, 2014న తాలిబన్లు బందీగా పట్టుకెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆయన తన కుటుంబంతో సహా వచ్చి మోదీని కలువనున్నారు. మోదీ కూడా ఆయన కుటుంబానికి శుభాకాంక్షలు తెలియ జేశారు.