తమిళనాడు, బెంగాల్ ముఠాలు దిగాయి జాగ్రత్త!
విజయనగరం: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన దొంగల ముఠాలు ఉత్తరాంధ్ర జిల్లాలలో తిరుగుతున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ హెచ్చరించారు. ఈ ముఠా సభ్యులు బ్యాంకుల ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. చిల్లర నోట్లతో ప్రజల దృష్టి మరల్చి, పెద్ద మొత్తంని దోచేస్తుంటారన్నారు. వీరు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో చోరీలకు పాల్పడినట్లు వివరించారు. బ్యాంకుల వద్ద అజ్ఞాత వ్యక్తుల సాయం తీసుకోవద్దని ఎస్పీ సలహా ఇచ్చారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో 9440795915 వాట్సప్ నెంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. కాలేజీలలో, ఆర్టీసీ బస్సులలో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినా, మహిళలను వేధింపులకు గురిచేసినా ఈ నెంబర్‌కు మెసేజ్ పంపితే వెంటనే స్పందిస్తామని ఆయన చెప్పారు.