తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ లో కొత్త ట్విస్ట్
చెన్నె: తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొత్త మలుపు తిరిగాయి. స్థానిక మీడియాలో జయలలితకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. పోలింగ్ చివరి 2 గంటల్లో అధికార అన్నాడీఎంకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని వెల్లడించింది. అన్నాడీఎంకే ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని తంతి టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. అన్నాడీఎంకే 111, డీఎంకే 99, మూడో ఫ్రంట్ 3, పీఎంకే 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని తెలిపింది. వేదారణ్యం స్థానంలో బీజేపీ గెలుస్తుందని అంచనా వేసింది.
జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఐదు ఎగ్జిట్ పోల్స్ లో ఒకటి మాత్రమే అన్నాడీఎంకు అధిక సీట్లు వస్తాయని పేర్కొంది. మిగతా నాలుగు డీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిపాయి. అన్నాడీఎంకు 139 స్థానాలు ఖాయమని సీఓటర్-టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా కట్టింది.
కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకున్నట్టు రాకపోవచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. యాక్సిస్ మై ఇండియా ఫలితాలు తిరగబడొచ్చని అన్నారు. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది.
పుదియ తలైమురై ఎగ్జిట్ పోల్స్ సర్వే: అన్నాడీఎంకే 164, డీఎంకే 66
కుముదమ్ రిపోర్టర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే: అన్నాడీఎంకే 162, డీఎంకే 41, డీఎంకే 15