జయలలిత ఆరోగ్యం కోసం పూజలు
- ముక్కంటీశునికి 66 కేజీల వెండి వస్తువుల బహూకరణ
శ్రీకాళహస్తి : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తమిళనాడు రేట్టరి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నీలకంఠం శనివారం శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం 66 కేజీల 543 గ్రాముల వెండి ఆభరణాలను ఆలయానికి అందజేశారు. వీటిలో స్వామివారి పానుమట్టంతోపాటు 50 రకాల పూజ సామగ్రి ఉన్నాయి. వీటి విలువ రూ.32,66,459 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, ఆలయ సభ్యులు లోకనాథం నాయుడు, మల్లెమాల ప్రమీలమ్మ, పీఎం చంద్ర, డాక్టర్ ప్రమీలమ్మలు పాల్గొన్నారు.