తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 70 ఏళ్లు
లండన్: ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 70 ఏళ్లు నిండాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ పంపిన కోడ్ సందేశాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగించిన తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ‘కోలోసస్’ 70వ వార్షికోత్సవాన్ని బ్రిటిష్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. బ్రిటిష్ టెలిఫోన్ ఇంజనీర్ టామీ ఫ్లవర్స్ ఈ భారీ కంప్యూటర్ను రూపొందించారు. దీని విశేషాలు...
‘కోలోసస్’ కంప్యూటర్ పరిమాణం దాదాపు ఒక గదికి సమానంగా ఉంటుంది (7 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పు). బరువు 5 టన్నులు.
8 కిలోవాట్ల విద్యుత్తు అవసరం. 2,500 వాల్వ్‌లు, 100 లాజిక్ గేట్లు, 10 వేల రెసిస్టర్లతో తయారైన ఈ కంప్యూటర్లోని తీగల పొడవు 7 కి.మీ.
తొలిసారిగా 1944 ఫిబ్రవరి 5న ఇది వినియోగంలోకి వచ్చింది.