నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్
నారాయణపేట రూరల్: నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్ అని కంపెనీ తెలంగాణ రీజియన్ టెక్నికల్ మేనేజర్ నరేశ్ అన్నారు. భారతి సిమెంట్ ఆధ్వర్యంలో స్థానిక డీలర్ లక్ష్మీవెంకటేశ్వర సిమెంట్ ఏజెన్సీలో గురువారం తాపీమేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరులో ఉన్న భారతి సిమెంట్ తాండూర్ ఫ్యాక్టరీ నుంచి ఏడాదికి 27 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందన్నారు. రోబోటెక్ టెక్నాలజీతో నాణ్యవంతంగా ఉంటుందన్నారు. టాపర్ఫ్రూఫ్ ప్యాకింగ్‌తో సిమెంట్లోకి తేమ చేరకుండా నాణ్యతను రక్షిస్తుందన్నారు. ఈ సిమెంట్‌ను వాడే వినియోగదారులకు ఉచితంగా కవరింగ్ బాక్సులు ఇస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణాల్లో ప్రమాదవశాత్తు మేస్త్రీలకు ఏమైన జరిగి మరణిస్తే వారికి రూ.రెండులక్షల వరకు కంపెనీ బీమా ఇస్తుందన్నారు.
వినియోగదారులు నమ్మకంతోనే నాణ్యవంతమైన సిమెంట్‌ను వాడుతున్నారని పేర్కొన్నారు. తాపీమేస్త్రీల సంఘం అధ్యక్షుడునర్సింహులు నాయుడు మాట్లాడుతూ.. మేస్త్రీలకు కంపెనీ నుంచి రూ.రెండులక్షల బీమా కల్పించడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో తాపీమేస్త్రీల సంఘం నాయకులు గోపాల్, నారాయణ, వెంకటప్ప, మేస్త్రీలు, డీలర్ రఘు తదితరులు పాల్గొన్నారు.