ఉత్పత్తి లక్ష్యం గగనం
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దశాబ్దన్నర కాలంగా ఉత్పత్తి లక్ష్యాలు 100 శాతం సాధిస్తూ వస్తున్న సింగరేణి ఈయేడు నీలినీడలు కమ్ముకున్నాయి. ఈసారి 100 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే అవకాశం లేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తోం దని కీర్తి గడించిన సింగరేణికి ఇప్పుడా పరిస్థితులు కనబడం లేదు. దీంతో యాజమాన్యంలో గుబులు మొదలైంది. ఇన్నాళ్లుగా 100 శాతం ఉత్పత్తి సాధిస్తూ ్త, ఈసారి సాధించకుంటే కంపెనీ ప్రతిష్ట మసక బారుతోందని, పాత రోజులు పునరావృతమయ్యే అవకాశం ఉంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
కొత్త ప్రాజెక్టులపై జాప్యం
ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణికి కలిసొచ్చినట్టు లేదు. మొదటి నుంచి ఉత్పత్తిపై ప్రభావం చూపే పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సర ంలోనే జరగాల్సిన కొన్ని ఓసీపీల ఓబీ టెండర్లు ఈ ఏడాది జరిగాయి. టెం డర్ అవార్డులో ఆలస్యం అయ్యింది. దీంతో భూ పాలపల్లి, మణుగూరు, మేడిపల్లి, శ్రీరాంపూర్ వంటి ఓసీపీల్లో ఓబీ పనులు నాలుగైదు నెల లుగా నడువలేదు. శ్రీరాంపూర్ ఓసీపీ అయితే 42 శాతం ఉత్పత్తి నమోదు చేసుకుంది. భూ నిర్వాసితుల సమస్య వల్ల ఉత్పత్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొదటి త్రైమాసికంలో ఈ ఓసీపీల్లో ఉత్పత్తి దెబ్బతింది.
దీనికితోడు మణుగూరు ఓసీపీ-2, బెల్లంపల్లి ఓసీపీ-2 వంటి కొత్త ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతుల్లో జాప్యం చేసింది. ఇటీవలే మణుగూరు ఓసీపీకి అనుమతులు వచ్చాయి. రామకృష్ణాపూర్ ఓసీపీ కూడా ఓబీ అనుకున్న సమయంలో మొద లు కా లేదు. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి జరుగాల్సి ఉం డగా కొద్ది రోజుల నుంచి మట్టి పనులు మొద లు పెట్టారు. అంతే కాకుండా సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టిన ఆడ్రియాల ప్రా జెక్టు ఈ ఏడాది వార్షిక లక్ష్యానికి ఊతమిస్తుందనుకుంటే అది ఇప్పుడిప్పుడే మొదలైంది. దీనికితోడు వర్షాలు కూడా సింగరేణి ఉత్పత్తిని దెబ్బతీశాయి. జూలై, ఆగస్టు నెలలో కురిసి వర్షాల వల్ల ఓసీపీల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
నిర్లిప్త వ్యవస్థ..
సింగరేణి కంపెనీలో నిర్లిప్త పాలన సాగుతున్నది. కార్పొరేట్ స్థాయిలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం, గతంలో నర్సింగ్‌రావు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఉన్నటు వంటి అజమాయిషీ ఇప్పుడు కొరవడింది. అవినీతి ఆరోపణలతో కొందరు అధికారులపై విజిలెన్సు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏది చేస్తే ఎక్కడికి వస్తుందో.. మనకెందుకులే అన్నట్లుగా అధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.
మ్యాన్ పవర్ కొరత తీవ్రంగా ఉంది. ఫేస్ వర్కర్ల రిక్రూట్మెంట్ లేకపోవడం, ఉన్న వారు అధిక సంఖ్యలో పదవీ విరమణ పొందడం ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఫేస్ వర్కర్లే కాకుండా ట్రేడ్‌మెన్, సూపర్వైజర్ల కొరత ఉంది. చివరికి గనుల్లో సేఫ్టీ కూడా గాలిలో దీపం అయ్యింది. ఎస్డీఎల్ యంత్రాల పనితీరు గతేడాది నుంచి కంటే మందగించింది. మరమ్మతులు వస్తే వాటికి విడిబాగాలు కూడా అందుబాటులో లేవు. పనిముట్ల, పరికరాల కొతర తీవ్రంగా ఉంది.
ఇక సమ్మక్క-సారలమ్మ వంతు..
సింగరేణికి సమక్క-సారలమ్మ జాతర కూడా ఈ ఏడు ఉత్పత్తికి ఆటంకం కలిగించనుంది. ఫిబ్రవరి రెండో వారం జాతర ఉంటుంది. సింగరేణిలో చాలా మంది కార్మికులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు ఉంటాయి. 80 శాతం ఈ వన దేవతలను కొలుస్తారు. దీంతో ప్రతి రెండేళ్లకోసారి వచ్చే జాతర సందర్భంగా గనుల్లో కార్మికుల హాజరు శాతం బాగా తక్కువగా నమోదవుతుంది. ఈసారి కూడా కార్మికుల హాజరు శాతం తగ్గి ఉత్పత్తిపై ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది. దీనికి తోడు ఫిబ్రవరి నెల చిన్న నెల(28 రోజులు) కావడం కొసమెరుపు.