Tarun Asthana
-
న్యూజిలాండ్‌లో దాడికి గురైన భారతీయుడి మృతి
మెల్బోర్న్: న్యూజిలాండ్‌లో దాడికి గురైన భారతీయుడు తరుణ్ ఆస్థానా(25) మృతి చెందారు. ఆక్లాండ్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన ఆదివారం ఉదయం ప్రాణాలు వదిలారు. తరుణ్ చనిపోయినప్పడు ఆయన కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. ట్రయినీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తరుణ్‌పై శనివారం సెంట్రల్ ఆక్లాండ్‌లోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ వద్ద దాడి జరిగింది. నైట్ క్లబ్ నుంచి స్నేహితులతో తిరిగివస్తుండగా ఆయనపై మాక్ ఫార్లాండ్(27) దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ దుస్తులపై కామెంట్ చేశాడన్న అక్కసుతోనే అతడీ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఆక్లాండ్ డిస్ట్రిక్ కోర్టులో హాజరుపరిచారు. అతడికి ఈనెల15 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా తమకు అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
న్యూజిలాండ్ లో ఎన్నారైపై దాడి, పరిస్థితి విషమం
న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన 25 ఏళ్ల తరుణ్ అస్థానాపై ఓ యువకుడు విచక్షణాత్మకంగా దాడి జరపడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. ట్రైనీ టీచర్ గా పనిచేస్తున్న తరుణ్ అక్లాండ్ లోని సిటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రోజున సాయంత్రం 5.10 నిమిషాలకు తరుణ్ పై దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ యువతి డ్రస్ బాగుందని కామెంట్ చేయడంలో ఆ యువతి బాయ్ ఫ్రెండ్.. తరుణ్ ముఖం, తలపై బాదినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ దాడిలో తరుణ్ తలకు బలమైన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ఈ వ్యవహారంలో అక్లాండ్ లో ఓ ఒకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.