టైటాన్ఎక్స్ ఇక టాటా ఆటోకాంప్ వశం!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన వాహన విడిభాగాల కంపెనీ ‘టాటా ఆటోకాంప్ సిస్టమ్స్’ తాజాగా ఇంజిన్ కూలింగ్ సప్లయర్ ‘టైటాన్ఎక్స్’ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. టైటాన్ఎక్స్ కంపెనీ కమర్షియల్ వెహికల్స్‌కు ఇంజిన్ అండ్ పవర్ట్రైన్ కూలింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. దీనికి అమెరికా, యూరప్, చైనా వంటి పలు దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి. దీని విక్రయాల విలువ 200 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. తమ భవిష్యత్ వృద్ధికి టైటాన్ఎక్స్ కొనుగోలు దోహదపడుతుందని టాటా ఆటోకాంప్ భావిస్తోంది.