Tata Finance
-
ఏపీ ‘స్వచ్ఛ భారత్’.. టాటా మోటార్స్ ఫైనాన్స్ తోడ్పాటు
విజయవాడ: స్వచ్ఛ భారత్ మిషన్‌ను విజయవంతం చేసేందుకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ టాటా మోటార్స్ ఫైనాన్స్ తెలిపింది. వ్యర్ధాల నిర్వహణ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునిస్తున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 792 టాటా ఏస్ వాహనాలకు సంబంధించి రూ. 36.62 కోట్ల రుణాలు అందించినట్లు కంపెనీ రీజనల్ బిజినెస్ హెడ్ టి. ప్రభు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (సీఎల్ఏపీ) కింద వ్యర్ధాల నిర్వహణ కోసం ఈ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను తమ సిబ్బంది త్వరితగతిన ప్రాసెస్ చేసి, రుణాల ప్రక్రియను వేగవంతం చేశారని ఆయన పేర్కొన్నారు. -
సెబీ నిషేధం
టాటా ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ కేసు న్యూఢిల్లీ: టాటా ఫైనాన్స్‌కు చెందిన మాజీ ఎండీ, డి. ఎస్. పెండ్సే, మరో మూడు సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. 2001 నాటి టాటా ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ కేసులో మోసాలకు పాల్పడ్డారంటూ సెబీ ఈ నిషేధం విధించింది. పెండ్సేపై మూడేళ్లు, టాటా ఫైనాన్స్ అనుబంధ సంస్థ నిస్కల్ప్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ మాజీ సీఈఓ ఎ. ఎల్. సిలోత్రితో పాటు ప్యాట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, సుపీరియర్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లు క్యాపిటల్ మార్కెట లావాదేవీల్లో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. పెండ్సే, సిలోత్రిలు ఏ లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి కీలకమైన మేనేజర్ స్థాయి పదవులు మూడేళ్లపాటు పొందరాదని కూడా సెబీ నిషేధం విధించింది.