tax authorities
-
రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే..
కేంద్రప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. అయితే రానున్న నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల అవసరాలు తీర్చేలా రూ.72,961.21 కోట్ల పన్నుల పంపిణీకి కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. వివిధ సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 11, 2023న ఇప్పటికే విడుదలైన నిధులకు తాజాగా విడుదల చేస్తున్న రూ.72,961.21 కోట్లు అదనం అని కేంద్రం ప్రకటనలో చెప్పింది. ఈ నిధుల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు అత్యధికంగా రూ.13,088.51 కోట్లు, బిహార్ రూ.7338.44 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.5727.44 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.5488.88 కోట్లు రానున్నాయి. ఇదీ చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం నిధులను 14 విడతలుగా రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు సమాచారం. 2023-24 బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది రాష్ట్రాలకు రూ.10.21 లక్షల కోట్లు బదిలీ చేయాలని కేంద్రం భావిస్తోంది. -
ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ శాఖకు చెందిన 86 మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులకు సోమవారం బదిలీ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురికి పదోన్నతులు సైతం కల్పించింది కేంద్రం. హైదరాబాద్ ఐటీ చీఫ్ వసుంధర సిన్హాను ముంబైకి బదిలీ చేసింది సీబీడీటీ. హైదరాబాద్ కొత్త ఐటీ చీఫ్‌గా శిశిర్ అగర్వాల్‌ను నియమించింది. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
పాక్‌పై ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలం
కరాచీ: పాకిస్థాన్‌లో ఉత్తర కొరియా రాయబారి, అతడి భార్యపై దాడి జరిగింది. స్వయంగా పాక్ చెందిన పన్నుశాఖ అధికారులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటికెళ్లి మరీ వారిని కొట్టారు. ఈ ఘటనపై ఇప్పుడు ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే మాత్రం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని, కచ్చితంగా దెబ్బతింటాయని హెచ్చరించింది. పాక్ ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ అధికారులకు ఉత్తర కొరియా రాసిన లేక ప్రకారం.. పాక్ పన్నుశాఖకు చెందిన పదిమంది అధికారులు ఆయుధాలు ధరించి కరాచీలోని ఉత్తర కొరియా రాయబారి ఇంటికెళ్లారు. అనంతరం రాయబారిపై దాడి చేయడమే కాకుండా అతడి భార్యను జుట్టుపట్టుకొని ఈడ్చి ఇద్దరిని కొట్టారు. వారి తలపై తుపాకులు ఎక్కు పెట్టి తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా గోడకు ఉన్న ఫొటోలపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఏప్రిల్ 9న చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును తీవ్రంగా భావించిన ఉత్తర కొరియా అంతర్గత వ్యవహారాల మంత్రి పాక్‌కు తీవ్ర హెచ్చరికత లేఖ రాశారు. ఇప్పటికే తామొక ఉన్నత స్థాయి కమిటీని వేశామని, అరెస్టు చేయకుంటే మాత్రం తామే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి తమకు నచ్చిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కరాచీలో దాడికి గురైన రాయబారి నిర్వహిస్తున్న విధుల వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.