Teacher MLC
-
బీజేపీ ఖాతాలో టీచర్ ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి (పీఆర్టీయూటీఎస్) గుర్రం చెన్నకేశవరెడ్డిపై ఆయన 1,169 ఓట్లు అధికంగా సాధించారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 29,720 మంది ఓట్లర్లు ఉండగా వారిలో 25,868 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఏవీఎన్ రెడ్డి 13,436 ఓట్లు సాధించి ఎన్నికల్లో గెలుపొందారు. బీజేపీ సంబరాలు... ఏవీఎన్ రెడ్డి విజయంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఏవీఎన్ రెడ్డిని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. ఆయన విజయానికి పార్టీ తరఫున కృషి చేసిన నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సుభాష్ చందర్జీలను అభినందించారు. సంజయ్ సారథ్యం ఫలితంగానే తాను గెలిచినట్లు వ్యాఖ్యానించిన ఏవీఎన్ రెడ్డి... బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అక్కడ జరిగిన విజయోత్సవాల్లో మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, డా.జి.మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్య కర్తలు బాణసంచా పేల్చి బ్యాండ్‌మేళాలతో సంబరాలు చేసుకున్నారు. సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్య ర్థి కి ఓటేసిన టీచర్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. ‘317 జీవోతో చెట్టుకొకరినీ.. పుట్టకొకరినీ చేసినందుకు, పీఆర్సీ కమిటీ ప్రకటించనందుకు, 3 డీఏలు బాకీ ఉన్నందుకు సీఎం కేసీఆర్‌కు తాము ఏమిటనేది ఈ ఎన్నికల్లో టీచర్లు చూపించారు. సీఎంకు కొమ్ము కాసే ఉపాధ్యాయ సంఘాలకు ఇదో గుణపాఠం. టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తాం’అని పేర్కొన్నారు. బీజేపీ అగ్రనేతల ట్వీట్లు ఏవీఎన్ రెడ్డి విజయంపట్ల బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అవినీతి ప్రభుత్వంతో విసిగిపోయారని, మోదీ నాయకత్వంలో పారదర్శక, పేదలపక్ష ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించి మోదీ సారథ్యంలోని బీజేపీని ముందుచూపుతో హత్తుకున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ‘ఇది పేదల వ్యతిరేక, అభివృద్ధి నిరోధక, అవినీతి, కుటుంబ బీఆర్ఎస్పై, ఆ పార్టీ అహంభావ, గరి్వష్టి నాయకత్వంపై ప్రజలిచి్చన మరో తీర్పు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. బీజేపీలో నయాజోష్... సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ద్వారా బీజేపీకి శాసనమండలిలో మళ్లీ ప్రాతినిధ్యం లభించినట్లు అయింది. గతంలో గ్రాడ్యుయేట్‌గా ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు పార్టీపక్షాన ప్రజాసమస్యలను లేవనెత్తేవారు. ఆ తర్వాత కౌన్సిల్లో పా ర్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. టీచర్లు, ఉద్యోగుల స్థానికత, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా తాము నిర్వహించిన ఆందోళనలు, కేసీఆర్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు, టీచర్లు సహా ప్రజాసమస్యలపై తమ పోరాటాలకు ఈ గెలుపు రూపంలో మద్దతు లభించిందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల అధినేత అయిన ఏవీఎన్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ లభించడంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలకపాత్ర పోషించారు. ఏవీఎన్ రెడ్డిని పోటీ చేయించి గెలిపిస్తే మరికొందరు బీజేపీలో చేరడం ఖాయమంటూ అధిష్టానాన్ని ఒప్పించారు. అందుకే ఇప్పటిదాకా ఎవరికీ నేరుగా బీఫారం ఇవ్వని బీజేపీ.. ఏవీఎన్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. -
ఓటర్లకు ఆన్లైన్లో నగదు పంపిణీ
తాడిపత్రి అర్బన్: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి ఉపాధ్యాయుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమచేసేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ ఎస్ఐ ధరణీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో ఉన్న లార్డ్ ఆసుపత్రి అధినేత చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ఓటమి ఖాయమని భావించిన ఆయన కొత్త పద్ధతుల్లో డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం కోడిగుడ్లపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబశివారెడ్డి, యల్లనూరుకు చెందిన పోస్టుమన్ నగేష్ ద్వారా తాడిపత్రి పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)లో శుక్రవారం 28 మంది ఉపాధ్యాయ ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా రూ.49 వేల నగదు బదిలీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ, రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. సాంబశివారెడ్డి, నగేష్ ప్రోద్బలంతో నగదు బదిలీ చేసినట్లు అతను అంగీకరించాడు. అతని నుంచి రూ.1,36,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు హెచ్ఎం సాంబశివారెడ్డి, పోస్టుమన్ నగేష్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు.. అనిల్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా కొండేపల్లికి చెందిన ఉపాద్యాయులు వజ్రగిరి, వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురం మండలం బెంజి అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు బత్తల రాజు, పి. నరసింహులుతో పాటు మరికొందరు కూడా శుక్రవారం తాడిపత్రిలో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. -
వేడెక్కిన రాజకీయం.. నోటిఫికేషన్‌కు ముందే జోరుగా ప్రచారం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నోటిఫికేషన్‌కు ముందే రసవత్తరంగా మారింది. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలు, మండలాల వారీగా పర్యటించి ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయ ఓటర్లను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయిస్తున్నారు. ఒకవైపు ఓటర్లను ఆకర్షిస్తూనే.. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు. జిల్లాల వారీగా ఉన్న ముఖ్య నేతలతో సమావేశమై మద్దతు ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీఆర్టీయూ తెలంగాణ మద్దతుతో ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మళ్లీ బరిలోకి దిగుతుండగా, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ నుంచి మాణిక్‌రెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు పోటీలో ఉన్నారు. మొదలైన ఓటర్ల నమోదు ప్రక్రియ 2023 మార్చితో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ చివరి నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించి.. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించనున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 33,116 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటికే 22 వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 9తో ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓటరు నమోదుపై దృష్టి సారించాయి. అభ్యర్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీల్లో పని చేస్తున్న అధ్యాపకులు, ప్రొఫెసర్లను స్వయంగా కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. రెండుగా చీలిపోయిన పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల్లో పీఆర్టీయూ కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ సంఘానికి 72 వేలకుపైగా సభ్యత్వాలు ఉన్నాయి. 2014కు ముందే ఈ సంఘం రెండుగా చీలిపోయింది. కొంతమంది ఉపాధ్యాయులు మాతృసంస్థ పీఆర్టీయూ తెలంగాణ నుంచి విడిపోయి పీఆర్టీయూ టీఎస్‌గా ఏర్పడ్డారు. గతంలో ఈ రెండు సంఘాలు కలిసే అభ్యర్థిని ప్రకటించి, ఈ మేరకు గెలిపించుకున్నాయి. పీఆర్టీయూ టీఎస్ రంగారెడ్డి జిల్లాకు చెందిన గుర్రం చెన్న కేశవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్న పీఆర్టీయూ తెలంగాణ ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పేరును మరోసారి ఖరారు చేసింది. వీరిద్దరూ గతంలో ఒకే సంఘంలో పని చేసిన వారే. ప్రస్తుతం కీలక నేతలిద్దరూ పోటీలో ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 317 జీఓ ఉపసంహరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనే అపవాదు ప్రస్తుత ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డిపై ఉంది. జిల్లాలోని మెజార్టీ ఉపాధ్యాయులు గుర్రం చెన్నకేశవరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఒకే ఉపాధ్యాయ సంఘం నుంచి చీలిపోయి ఇద్దరు పోటీలో ఉండటం ప్రత్యర్థులకు కలిసిరానుంది. ఇద్దరి మధ్యలో యూటీఎఫ్ అభ్యర్థికి సైతం గెలుపు అవకాశాలు ఉంటాయని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాలి. -
హామీల అమలులో సీఎం విఫలం
సాక్షి, సిద్దిపేట: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారిస్తానని సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నారని కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. గత సంవత్సరం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి ఒక్క సమస్యను పరిష్కరించక పోవడం సరికాదన్నారు. ఆదివారం స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఒక్క రోజు సత్యాగ్రహదీక్ష నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు అడుగుతున్న డిమాండ్లు అన్నీ న్యాయమైనవేనని అవి పరిష్కరించే వీలున్నప్పటికి పరిష్కారానికి నోచుకోక పోవడం శోచనీయమన్నారు. ప్రమోషన్లు, సీపీఎస్ రద్దు, సర్వీస్‌రూల్స్, పీఆర్సీ అమలు, స్పెషల్‌టీచర్లకు ఇంక్రిమెంట్ల హామీలు నెరవేర్చాలన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, కొత్త నరేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రాష్ట్రశాఖ పిలుపుమేరకు ఒక్క రోజు సత్యాగ్రహదీక్షను చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర బాద్యురాలు లక్కిరెడ్డి విజయ, నాయకులు జయపాల్‌రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు
-
టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు
♦ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు ♦ ఈసీ సూచన మేరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియో జకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నిర్వహించిన పోలింగ్ అనూహ్యంగా రద్దయింది. గురు వారం జరిగిన ఈ పోలింగ్‌లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లో ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడం దీనికి కారణమైంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న (ఆదివారం) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. పోలింగ్ మొదలయ్యాక గుర్తింపు.. రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాల పరిధిలో ఉన్న 126 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ మొదలైంది. మొత్తం 23,789 మంది ఓటర్లు ఉండగా.. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తీరా పోలింగ్ మొదలయ్యాక బ్యాలెట్ పేపర్లో మూడో నంబర్లో ఉన్న అభ్యర్థి ఆది లక్ష్మయ్య, తొమ్మిదో నంబర్లో ఉన్న పి.మాణిక్‌రెడ్డి ఫొటోలు తారుమారైనట్లు గుర్తించడంతో.. గందరగోళం మొదలైంది. అభ్యర్థులతోపాటు ఎన్నికల ఏజెంట్లు, అధికారులు వెంటనే దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణలో ఈ తప్పు జరిగినట్లు నిర్ధారించిన సీఈవో భన్వర్‌లాల్.. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ నుంచి తదుపరి ఆదేశాలు అందేంత వరకు అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించారు. దాంతో ఈ ఎన్నిక రద్దవుతుందా.. లేదా అనే ఉత్కంఠ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకే ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో దాదాపు 51 శాతం పోలింగ్ నమోదైంది కూడా. ఈలోగా ఎన్నికను రద్దు చేయవద్దంటూ కొందరు, రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రాలు అందించారు. అయితే చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎన్నికను రద్దు చేస్తున్నట్లు సాయంత్రం ఆరు గంటల సమయంలో భన్వర్‌లాల్ ప్రకటించారు. 19వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని.. ఓటర్లు తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు ఆదేశించిన ఈసీ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరు బాధ్యులనే అంశాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని సీఈవో భన్వర్‌లాల్‌ను ఆదేశించింది. మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిసారిగా బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లతో పాటు వారి ఫొటోలను ముద్రించారు. కానీ ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారయ్యాయి. ఈ చిన్న పొరపాటుతో మళ్లీ ఎన్నికలు నిర్వహిం చాల్సి రావటంతో పాటు పోలింగ్ నిర్వహ ణకు వెచ్చించిన దాదాపు రూ.2 కోట్లు వృథా అయ్యాయి. మళ్లీ అంత ఖర్చు చేసి, ఎన్నిక నిర్వహించాల్సి రానుంది. ముద్రణలోనే తప్పిదం.. ‘‘బ్యాలెట్ పేపర్ ముద్రణ సమయంలోనే తప్పిదం జరిగింది. ముందు మాకు పంపించిన ప్రూఫ్‌లో అక్షరాల తప్పులు తప్ప ఫొటోలన్నీ సరిగ్గానే ఉన్నాయి. అక్షరాల్లో తప్పులు దిద్ది సవరించిన రెండో ప్రూఫ్‌లో ఫొటోలు తారుమారయ్యాయి. అక్షరాల్లో తప్పులు సరిచేశారా.. లేదా.. అని చూసుకున్న అధికారులు ఫోటోలు మారడాన్ని గమనించక పోవడంతో తప్పు దొర్లింది. చివరకు బ్యాలెట్ పేపర్లు సరిగా ఉన్నాయా.. లేదా అని పరిశీలించాల్సిన రిటర్నింగ్ అధికారి సైతం గుర్తించలేదు. చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్‌లో బ్యాలెట్ల ముద్రణ జరిగింది. మేం సరిగ్గా పంపిన ఫొటోలు ఎందుకు మారాయి, అక్కడి సిబ్బంది ప్రమేయమేమైనా ఉందా, దీనికి బాధ్యులెవరనే దానిపై విచారణ జరిపి.. ఈసీకి నివేదిస్తాం. ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం..’’ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్