టీచర్ల పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేష¯ŒS కోర్సుల అమలు
మున్సిపల్ మంత్రి నారాయణ
అమలాపురం టౌ¯ŒS :
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదవించినప్పుడే ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. అమలాపురం కొంకాపల్లి జవహర్ లాల్ నెహ్రు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఫౌండేష¯ŒS కోర్సు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మంగళవారం రాత్రి మంత్రి నారాయణ ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించన ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో 500 మంది పాల్గొనగా అందులో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో విద్యా ప్రమాణాల్లో మరీ వెనుకబడి ఉన్నారన్న దృష్టితోనే రాష్ట్రంలో ఎంపిక చేసిన 57 మున్సిపాలిటీల్లో ఫౌండేష¯ŒS కోర్సులు అమలు చేస్తున్నుట్టు తెలిపారు. మంత్రి నారాయణ పలువురు ఫౌండేష¯ŒS కోర్సు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో
ముఖాముఖీ నిర్వహించారు. వారు ఏం
చదువు తారు...భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నారని అడిగారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ ఇష్టాగోష్టిలో మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, జెడ్పీ చైర్మ¯ŒS
నామన రాంబాబు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్వర్మ, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. చివరగా మంత్రి నారాయణ కొంకాపల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.