ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ
అనంతపురం సెంట్రల్ : నగరంలో న్యూ రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శోభ ఇంట్లో చోరీ జరిగింది. వన్‌టౌన్ సీఐ రాఘవన్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా శోభ పని చేస్తోంది.
విధి నిర్వహణలో భాగంగా మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం వచ్చే సరికి ఇంటి బీరువాలోని 20 తులాలు బంగారు, రూ. 50 వేలు నగదు అపహరించుకుపోయారు. ఘటనపై బుధవారం ఉదయం బాధితురాలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.