‘విష్ణు’లో జాతీయస్థాయి ఫ్యాకల్టీ ప్రోగ్రాం ప్రారంభం
భీమవరం : బిగ్ డేటా ఎనలిస్టిక్ అనే అంశంపై భీమవరం పట్టణంలోని విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఐదు రోజుల జాతీయస్థాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగాం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాండిచ్చేరి ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ఎఫ్ఎస్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ బిగ్ డేటా ద్వారా అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు, వ్యాపార సంబంధిత సమాచారం ఏ విధంగా జరుగుతుంది, అందులోని నూతన పద్ధతులను వివరించారు. నొయిడా ఇన్నోవెయిన్స్ టెక్నాలజీ శిక్షకుడు మనీస్ జైన్ మాట్లాడుతూ బిగ్ డేటా విశ్లేషణలో వినియోగిస్తున్న ఆధునిక టూల్స్‌పై సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీనివాసరాజు, కన్వీనర్ వి.పురుషోత్తమరాజు, సమన్వయకర్త డాక్టర్ పి.కిరణ్‌శ్రీ పాల్గొన్నారు.