Tejas Networks
-
గుజరాత్ అంబుజా- తేజస్.. భలేభలే
ప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కేడియా కంపెనీలో వాటాను కొనుగోలు చేసిన వార్తలతో జోరు చూపుతున్న తేజస్ నెట్వర్క్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క షేర్ల విభజన వార్తలతో గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. తేజస్ నెట్వర్క్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ తేజస్ నెట్‌వర్క్స్‌లో 0.81 శాతం వాటాను కేడియా సెక్యూరిటీస్ కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్‌డీల్స్ డేటా పేర్కొంది. ప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కిషన్‌లాల్ కేడియాకు చెందిన ఈ సంస్థ షేరుకి రూ. 49.13 ధరలో దాదాపు 7.54 లక్షల తేజస్ షేర్లను సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 3.7 కోట్లను వెచ్చించింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో తేజస్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 54.3 వద్ద ఫ్రీజయ్యింది. వరుసగా మూడో రోజూ ఈ షేరు అప్పర్ సర్క్యూట్‌ను తాకడ గమనార్హం! గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ షేర్ల విభజన ప్రతిపాదనను ఈ నెల 25న నిర్వహించనున్న సమావేశంలో కంపెనీ బోర్డు పరిశీలించనున్నట్లు ఆగ్రో ప్రాసెసింగ్ కంపెనీ గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ తాజాగా పేర్కొంది. అంతేకాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్ ఫలితాలను సైతం వెల్లడించనన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుజరాత్ అంబుజా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 143 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 145 వరకూ ఎగసింది. -
స్ట్రైడ్స్ ఫార్మా- తేజాస్ నెట్వర్క్.. జోష్
మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్ సెంచరీతో సాగుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ తేజాస్ నెట్వర్క్స్, హెల్త్‌కేర్ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. తేజాస్ నెట్వర్క్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తేజాస్ నెట్‌వర్క్స్‌లో 0.81 శాతం వాటాను కేడియా సెక్యూరిటీస్ కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్‌డీల్స్ డేటా పేర్కొంది. ప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కిషన్‌లాల్ కేడియాకు చెందిన ఈ సంస్థ షేరుకి రూ. 49.13 ధరలో దాదాపు 7.54 లక్షల తేజాస్ షేర్లను సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 3.7 కోట్లను వెచ్చించింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో తేజాస్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 52 సమీపంలో ఫ్రీజయ్యింది. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా ఫియొరిసెట్ కోడియిన్ క్యాప్సూల్స్ జనరిక్ వెర్షన్‌కు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందినట్లు దేశీ హెల్త్‌కేర్ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ తాజాగా పేర్కొంది. వీటిని 50ఎంజీ/325 ఎంజీ, 40 ఎంజీ/30ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. తెవా ఫార్మాకు చెందిన ఫియొరిసెట్ కోడియిన్ క్యాప్సూల్స్ ప్రధానంగా ఒత్తిడితో ఎదురయ్యే తలనొప్పి.. తదితర నొప్పుల నివారణకు వినియోగించవచ్చని స్ట్రైడ్స్ ఫార్మా పేర్కొంది. ఈ నేపథ్యంలో స్ట్రైడ్స్ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.5 శాతం పెరిగి రూ. 426 వద్ద ట్రేడవుతోంది. తొలుత 5 శాతం ఎగసి రూ. 432 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. -
ఐపీఓ.. బౌండరీ!
♦ పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నాలుగు కంపెనీలు ♦ రూ.5,000 కోట్ల సమీకరణ ♦ ముందుగా తేజాస్ నెట్వర్క్స్ ముంబై: ఈ నెల ఐపీవో మార్కెట్ కొత్త కళ సంతరించుకోనుంది. నాలుగు కంపెనీలు ప్రజల నుంచి నిధుల సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం మీద రూ.5,000 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. వీటిలో ముందుగా తేజాస్ నెట్వర్క్స్, ఆ తర్వాత ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఐపీవోలు రానున్నాయి. తరవాత వరుసలో చిన్న ఫైనాన్షియల్ బ్యాంకు ‘ఏయూ’, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్ఎల్)ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 సంస్థలు ఐపీవో రూట్లో రూ.6,335.83 కోట్లను రాబట్టుకున్నాయి. 14 నుంచి తేజాస్ నెట్వర్క్స్ ఐపీవో టెలికం సంస్థలకు ఉత్పత్తులు, డిజైన్ సేవలు అందించే తేజాస్ నెట్వర్క్స్ ఐపీవో ఈ నెల 14న ప్రారంభం కానుంది. జూన్ 16న ముగుస్తుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.250–257గా ఖరారు చేశారు. ఈ ఐపీవో ద్వారా సంస్థ రూ.776 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.450 కోట్ల మేర తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా 1,27,11,605 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఈ సంస్థలో గోల్డ్‌మ్యాన్ శాక్స్, ఇంటెల్ క్యాపిటల్, ఫ్రంట్‌లైన్ స్ట్రాటజీ, మేఫీల్డ్ ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. కనీసం 55 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చిన్న ఫైనాన్స్ బ్యాంకు సేవలకు ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందిన 10 సంస్థల్లో ఏయూ ఒకటి. ఈ సంస్థ రూ.2,000 కోట్లను సమీకరించేందుకు ఈ నెలాఖరులో ఐపీవోకు రావాలనే ప్రణాళికతో ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో ఐపీవో కోసం సెబీకి దరఖాస్తు చేసుకోగా, మార్చిలో అనుమతి లభించింది. ప్రస్తుతం ఐపీవోకు ముందస్తు రోడ్‌షో జరుగుతోంది. ఈ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, వార్బర్గ్ పింకస్, క్రిస్ క్యాపిటల్, కేదార క్యాపిటల్ సంస్థలు ఐపీవో ద్వారా తమ వాటాలను విక్రయిస్తాయి. అంటే ఈ ఐపీవోతో సమకూరే నిధులన్నీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికే వెళతాయి. ఈక్విటాస్, ఉజ్జీవన్ సంస్థల తర్వాత స్టాక్ మార్కట్లో నమోదయ్యే మూడో చిన్న బ్యాంకు ఏయూనే అవుతుంది. జూన్ 16 నుంచిఎరిస్ లైఫ్‌సైన్సెస్ ఐపీవో ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 600–603గా నిర్ణయించినట్లు ఎరిస్ లైఫ్‌సైన్సెస్ వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ.1 ముఖవిలువ గల 2,88,75,000 షేర్లను కంపెనీ విక్రయిస్తోంది. జూన్ 16న ప్రారంభమయ్యే ఆఫర్ 20న ముగుస్తుంది. ఎరిస్ లైఫ్‌సైన్సెస్ .. బ్రాండెడ్ ఫార్మా ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అస్సాంలోని గువాహటిలో సొంత ప్లాంటు ఉంది. సీడీఎస్ఎల్.. 400 కోట్లు డిపాజిటరీ సేవల్లోని సీడీఎస్ఎల్ ఐపీవో సైతం ఈ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంస్థ ఐపీవో ద్వారా రూ.400 కోట్లను సమీకరించనుంది. ఇప్పటికే సెబీ ఆమోదం లభించింది. కంపెనీలో బీఎస్ఈ, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, కల్కత్తా స్టాక్ ఎక్సేంజ్‌కు మొత్తం 65.65 శాతం వాటా ఉంది. ఒక్క బీఎస్ఈకే 50 శాతం వాటా ఉంది. ఐపీవోలో ప్రస్తుత ఇన్వెస్టర్లే కొద్ది మేర వాటాలను విక్రయించనున్నారు. అయితే, ఈ ఐపీవో తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.