'ఏకగ్రీవంకు ప్రభుత్వం చొరవ చూపాలి'
హైదరాబాద్: తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ చూపాలని బీజేపీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆయా పార్టీలకు ఉన్న బలాల మేరకు ఏకగ్రీవం అయ్యే అవకాశముందని చెప్పారు.
అయితే తమకున్న సంఖ్య మేరకు తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించడం ఖాయమని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరావు దీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది.
తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి ఐదుగురు... కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒక్కొక్కరూ నామినేషన్ వేశారు.