Telangana educational institutions
-
సెలవులు ముగియడంతో తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు..
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల తర్వాత విద్యా సంస్థలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోబోతున్నాయి. రెండు వారాల తర్వాత స్కూళ్లు, కాలేజీలు మళ్లీ సందడిగా మారనున్నాయి. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 9 వరకూ ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చారు. ఆ తర్వా త కొద్ది రోజులకు కాలేజీలకు సెలవులి చ్చారు. సెలవులు రావడంతో విద్యార్థులంతా సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు.. అన్ని ఖాళీ అయ్యాయి. ఉపాధ్యాయులు కూడా తమ ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. విద్యా సంస్థల పునః ప్రారంభంతో వీళ్లంతా తిరిగి తమ గూటికి చేరుకుంటున్నారు. దసరా సెలవుల తర్వాత జరిగే బోధన స్కూల్ విద్యార్థులకు కీలకమైంది. ఎఫ్ఏ–2 పరీక్షలు జరిగినా, పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన సిలబస్ మాత్రం పూర్తవ్వలేదు. ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలు పెట్టారు. దీంతో ద్విభాష పుస్తకాలు ముద్రించాల్సి వచ్చింది. పుస్త కాల బరువు పెరగకుండా వాటిని రెండు భాగా లుగా చేశారు. ఈ కారణంగా ముద్రణ ఆలస్యమైంది. కొన్నిచోట్ల సెప్టెంబర్ మొదటి వారం వరకూ పార్ట్–1 పుస్తకాలు అందలేదు. దీనికి తోడు కరోనా కారణంగా నష్టపోయిన అభ్యసనను తిరిగి దారి లోకి తెచ్చేందుకు బ్రిడ్జ్ కోర్సులు, తొలిమెట్టు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ సిలబస్ ఆలస్యమవడానికి కారణమయ్యాయి. వాస్తవానికి పార్ట్–1 పుస్తకాల్లోని సిలబస్ దసరా సెలవుల కన్నా ముందే పూర్తవ్వాలి. ఇది సాధ్యం కాకపోవడంతో తిరిగి పార్ట్–1లోని పాఠాలు చెప్పాల్సి ఉంటుందని టీచర్లు అంటున్నారు. ఇది పూర్తయి, పార్ట్–2 ఎప్పు డు మొదలు పెడతారనేదానిపై ఉపాధ్యాయ వర్గా లు స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే, పదోన్నతులు, బదిలీల డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. -
‘గురుకుల బోర్డు’కు ప్రత్యేక కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ)కు ప్రత్యేక కార్యాలయం సిద్ధమవుతోంది. నగరంలోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో నాలుగో అంతస్తును బోర్డుకు ప్రభుత్వం కేటాయించింది. దీంలో ఇక్కడ మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి. సొసైటీల్లో సీనియర్ సెక్రటరీ బోర్డుకు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మిగతా సెక్రటరీలు సభ్యులుగా కొనసాగుతారు. బోర్డులోని ప్రతిసభ్యుడికి ప్రత్యేక చాంబర్ ఉండేలా కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 18న గురుకుల పాఠశాలల్లో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. ఈ మేరకు బోర్డు కసరత్తు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ పరిధిలోని గురుకులాల్లో బోధన, బోధనేతర విభాగాల్లో 5,313 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశముంది. పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర అంశాలపై ప్రతిపాదనలు రూపొందించిన బోర్డు ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే.. నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. -
ఇటువైపు చూడని విదేశీ విద్యార్థులు
ఆకర్షించలేకపోతున్న తెలంగాణ విద్యా సంస్థలు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధిక విద్యా సంస్థలు కలిగిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు విదేశీ విద్యార్థులను మాత్రం ఆకర్షించలేకపోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలు ఇందులో ముందుండగా...తెలుగు రాష్ట్రాలు చివ రి స్థానాల్లో నిలిచిపోయాయి. మరోవైపు ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో చదివేందుకు ఇతర దేశాలవారు ఆసక్తి చూపడం లేదు. దేశంలో వర్సిటీలు, ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి 800కు పైగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా విదేశీ విద్యార్థులను రాబట్టలేకపోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల వైపు మొగ్గు... దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో 3.32 కోట్ల సీట్లు అందుబాటులో ఉండగా, వీటిలో 10% సీట్లలో విదేశీయులను చేర్చుకునే వీలుంది. ఈ లెక్కన 30 లక్షల మందికి అవకాశం ఉంది. అయితే భారత్‌లోని వర్సిటీల పరిధిలో ప్రస్తుతం చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 31,126 మాత్రమే. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లోని విద్యా సంస్థల్లోనే చదువుతున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియన్ వర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా-2015 నివేదిక స్పష్టం చేస్తోంది. తెలంగాణలో దాదాపు 16 లక్షల సీట్లు ఉన్నత విద్యలో ఉండగా, ఒక్క శాతం కూడా విదేశీ విద్యార్థులను ఆకర్షించలేకపోతోంది. ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి. తెలంగాణలో 5.45 శాతం... మొత్తం 31,126 మంది విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా 7,750 మంది (24.90 శాతం) మహారాష్ట్రలో... 7,290 మంది (23.42 శాతం) ఢిల్లీలో... 4,877 మంది (15.67 శాతం) కర్ణాటకలో చదువుతున్నారు. తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (3,548), పంజాబ్ (1,964) ఉన్నాయి. తెలంగాణలో 1,696 మంది (5.45 శాతం) విద్యార్థులు చదువుతున్నట్లు నివేదిక పేర్కొంది. దేశంలోని విదేశీ విద్యార్థుల్లో ఎక్కువమంది (23,350) ఆసియా దేశాలకు చెందిన వారు కాగా, 5,799 మంది ఆఫ్రికా వారున్నారు. అమెరికా విద్యార్థుల సంఖ్య కేవలం 457 మాత్రమే!