పోలీసుల సమస్యల పరిష్కారానికి డీజీపీ హామీ
సంగారెడ్డి క్రైం: తెలంగాణ పోలీసు ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ కొత్త డీజీపీ అనురాగ్‌శర్మను తెలంగాణ పోలీసు ఫోరం జిల్లా అధ్యక్షుడు కృష్ణ గురువారం కలిశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల సమస్యల గురించి డీజీపీకి వివరించామన్నారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించి పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని పోలీసులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారన్నారు. పోలీసు పిల్లలందరికీ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి అందరికీ ఇప్పించడానికి కృషి చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారన్నారు. హోంగార్డు సేవలను గుర్తించి ఆరోగ్య భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు.