Republic Day Parade: పోరాట యోధుల థీమ్‌తో తెలంగాణ శకటం
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శకటాలు ఎంపికయ్యాయి. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరిట ఈ ఏడాది తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది. చాకలి ఐలమ్మ, కొమరం భీం, రాంజీ గోండు తదితర పోరాట యోధులతో శకటాన్ని ఏర్పాటు చేశారు. ఈ థీమ్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. జనవరి 26న కర్తవ్యపథ్‌లో తెలంగాణ శకటం సందడి చేయనుంది.
కాగా తెలంగాణ శకటం ప్రదర్శనకు వచ్చే సమయంలో దానికి ఇరువైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒకసారి, 2020లో మరోసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ శకటం కనువిందు చేయగా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రస్తుత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శకటానికి అవకాశం లభించింది
మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎంపికైన ఏపీ శకటం.. ఈసారి డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో ప్రదర్శనకు ఏర్పాటైంది. దేశంలోనే తొలిసారిగా 62,000 డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది. జనవరి 26న కర్తవ్య పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనుంది.