telangana weather
-
తెలంగాణలో మరో రెండు రోజులు వానలే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం వాతావరశాఖ తెలిపింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని.. 26 నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి తుఫాను చేరుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయి. -
తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో రేపు(శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
కుండపోత వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం
-
అలర్ట్: మరో మూడు రోజులు భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల ఇంకా వర్షప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక కుండపోత వర్షంతో రాజధాని హైదరాబాద్.. జంట నగరం సికింద్రాబాద్లు అతలాకుతలం అయ్యాయి. ఎటు చూసినా నగర జీవనం అస్తవ్యస్తంగా కనిపించింది. రెండు గంటల్లో.. దాదాపు 10 సెం.మీ. మేర కురిసింది వాన. మోకాళ్ల లోతు నీరు ఎటు చూసినా నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీగా ట్రాఫిక్ఝామ్ కాగా.. కిలోమీటర్ దూరం దాటేందుకు గంటకు పైగా ఎదురు చూడాల్సి వస్తోంది. రంగారెడ్డి, శంషాబాద్ మండలాల్లోనూ భారీ వర్షాల ప్రభావం కనిపించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యింది. మూసీకి వరద నీరు పోటెత్తడంతో అంబర్పేట మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరింది. ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్జామ్ భారీగా అయ్యింది. చాలాచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. వర్షం మొదలైన కాసేపటికే పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ప్రయాణాన్ని రెండు గంటలపాటు వాయిదా వేసుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే వాహనదారులకు సూచించడం తెలిసిందే. నగరంలో.. నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే.. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో 8.6. ఖైరతాబాద్ 7.5 సెం.మీ. సరూర్నగర్ 7.2 సెం.మీ. రాజేంద్రనగర్లో 6.4 సెం.మీ, మెహదీపట్నంలో 4.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరంగల్ జిల్లాలో భారీ వర్షం
-
తెలంగాణలో భారీ వర్షాలు నీట మునిగిన కాలనీలు
-
హైదరాబాద్ లో భారీ వర్షం
-
మరో రెండురోజులు పగలు కూడా చ...చ... చలే!
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పగటిపూట కూడా చలిగాలులు తప్పవు. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా బాగా కిందకు పడిపోయాయి. రాష్ట్రం మొత్తమ్మీద మెదక్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో శని, ఆది వారాలలో చలి గాలులు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులను వివరిస్తూ ఈ విషయం తెలిపారు.