Telephone Bhavan
-
నేత్రపర్వంగా గురుపౌర్ణమి వేడుకలు
అనంతపురం కల్చరల్: జిల్లా వ్యాప్తంగా శనివారం గురుపౌర్ణమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. నగరంలోని వేమన టెలిఫోన్ భవన్ ఎదురుగా ఉన్న షిర్డీ సాయిబాబా మందిరానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం చేశారు. హెచ్చెల్సీ కాలనీలోని షిర్డీ సాయిబాబా మందిరం, వలీబాబా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. వేణుగోపాల్ నగర్‌లోని షిర్డీ సాయిబాబా మందిరంలో మేయర్ స్వరూప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే హౌసింగ్ బోర్డులోని సాయినాథుని మందిరం, ఆంధ్రాబ్యాంకు కాలనీ, మూడో రోడ్డులోని సాయి మందిరం, రామచంద్రనగర్‌లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మారుతీనగర్‌లోని బాబా మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం సాయిలీల బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ దేవరకొండ శాంతమూర్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాయలసీమ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గాయత్రి హాస్పిటల్లో జరిగిన వేడుకల్లో సీఐ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. పాతూరు చెరువుకట్టపై గల సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా సంఘమేష్ నగర్, రామనగర్, అరవిందనగర్‌లోని సత్యసాయి కల్యాణమండపం, లక్ష్మీనగర్ సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు విశేష పూజల్లో పాల్గొన్నారు. -
గంగ ఒడికి మహా గణపతి
బుధవారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన ఘట్టం గురువారం సాయంత్రానికి పూర్తయింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణనాథుని శోభాయాత్ర గురువారం మధ్యాహ్నానికి ట్యాంక్‌బండ్‌కి చేరుకుంది. 1.53 నిమిషాల ప్రాంతంలో గోనాగ చతుర్ముఖ గణపతి సాగర గర్భంలోకి చేరాడు. మరోపక్క హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఖైరతాబాద్, న్యూస్‌లైన్: గోనాగ చతుర్ముఖ గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. బుధవారం అర్ధరాత్రి 2.30 గంటలకు నిమజ్జనానికి బయల్దేరిన భారీకాయుడు దాదాపు పన్నెండు గంటల పాటు ప్రయాణించి గురువారం మధ్యాహ్నం 1.53 గంటలకు సాగర గర్భంలోకి ప్రవేశించాడు. మహా గణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు అశేష భక్తజనులు తరలివచ్చారు. అర్ధరాత్రి 2.30: మంటపం నుంచి బయల్దేరిన మహా గణపతి తెల్లవారుజామున 4: సెన్సేషన్ థియేటర్ వద్దకు చేరిక 6.40: రాజ్‌దూత్ చౌరస్తాకు రాక 7.45: టెలిఫోన్ భవన్ వద్దకు చేరిన లంబోదరుడు 8.05: సచివాలయం పాతగేటు వద్దకు చేరుకోగా.. భారీగా తరలివ స్తున్న విగ్రహాల కారణంగా అరగంట పాటు అక్కడే నిలిపివేశారు 8.25: తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు రాక 9.25: సచివాలయం వద్దకు చేరిన మహా గణపతి 11.00: 6వ నెంబర్ క్రేన్ వద్దకు చేరిక మధ్యాహ్నం 1.00: తుది పూజలు.. చివరిసారి దర్శనం కోసం భక్తులు దూసుకురావడంతో తోపులాట 1.53: సాగర గర్భంలోకి చేరిన గణపయ్య లడ్డూ బాగుంటే.. నేడు పంపిణీ ఖైరతాబాద్, న్యూస్‌లైన్: వర్షంలో తడిసిన ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ఏమాత్రం బాగున్నా.. భక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ లంబోదరుడి చేతిలో ఏర్పాటు చేసిన 4200 కిలోల లడ్డూ బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి తడిసింది. దాదాపు మూడు గంటల పాటు వర్షంలో తడవడంతో అది చక్కెర పానకంలా తయారైంది. లడ్డూను దించిన తర్వాత కవర్లతో కప్పి ఉంచడం వల్ల గాలి ఆడక కూడా అది చెడిపోయే అవకాశముందని సురుచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు తెలిపారు. ఒకవేళ లోపలి భాగం పాడవకుండా ఉంటే శుక్రవారం పంపిణీ చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ చెప్పారు.