సుప్రీంకోర్టులో దయానిధి మారన్‌కు ఊరట
న్యూఢిల్లీ : టెలిఫోన్ ఎక్స్ఛేంజి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మారన్ లొంగిపోవాలన్న మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసులో సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో మారన్ ముందస్తు బెయిల్‌ను మద్రాసు హైకోర్టు సోమవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మారన్ మూడు రోజుల్లోపు లొంగిపోవాలని పేర్కొంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాగా మారన్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ జూలై నెలలోనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో ఆయనకు సహకరించకూడదని.. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఆయనేనని సీబీఐ తెలిపింది. దయానిధి కేంద్రమంత్రిగా 2004 - 2007 కాలంలో పని చేశారు. ఆ సమయంలో తన సోదరుడైన కళానిధి మారన్‌కు 300 హైస్పీడ్ టెలిఫోన్ లైన్లు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. కళానిధి ఆ లైన్లను సన్ టీవీ కార్యక్రమాల్ని కి అప్ లింక్ చేయడానికి ఆ లైన్లను వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.