విద్యుదాఘాతానికి టెలిఫోన్ లైన్ మన్ బలి
హిందూపురం అర్బన్ : విద్యుదాఘాతానికి టెలిఫోన్ లైన్ మన్ నాగిరెడ్డి (50) సోమవారం బలయ్యాడు. వివరాలు..మండలంలోని నక్కలపల్లికి చెందిన నాగిరెడ్డి టెలిఫోన్ లైన్ మన్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా హిందూపురంలో స్థిరపడ్డాడు. సోమవారం శాంతీటాకీస్ ఏరియాలో టెలిఫోన్లు లైన్లు మరమ్మతు చేస్తున్నాడు. సమీపంలోని ఇంటిపైకి ఎక్కి కేబుల్‌ను అవతలికి విసిరేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కేబుల్ 33 కేవీ హైటెక్ష¯ŒS తీగలకు తగిలింది. చేతిలోనే కేబుల్ పట్టుకుని ఉండగా అదే సమయంలో విద్యుత్ ప్రసరించింది. విద్యుత్ షాక్‌కు గురై అక్కడే పడిపోయాడు.
స్థానికులు గమనించి విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చూడగా అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. టెలిఫో¯ŒS ఎక్సేంజ్ కార్యాలయంలో అందరితో సన్నిహితంగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరున్న నాగిరెడ్డి మరణించడాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసును వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.