చిరంజీవితో సినిమా తీసే అవకాశం వస్తేనా..: వినాయక్
మెగాస్టార్ చిరంజీవితో మరోసారి సినిమా తీసే అవకాశం వస్తే చాలా సంతోషిస్తానని ప్రముఖ దర్శకుడు వి.వి.నాయక్ అన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఠాగూర్' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం 38వ జన్మదినం జరుపుకొంటున్న వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
'చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన మళ్లీ నటిస్తారా లేదా అన్న విషయం నాకు తెలియదు. ఐతే చిరంజీవి పునరాగమనం చేయాలని భావించి, నాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పిస్తే చాలా సంతోషిస్తా' అని వినాయక్ చెప్పారు.