పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజురోజుకు వేసవితాపం అధికమవుతుండటంతో ప్రజల పరిస్థితి ఇబ్బందిగా మారుతోంది. మంగళవారం శింగనమల మండలం తరిమెలలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కూడేరు మండలంలో 42.3 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 42.2 డిగ్రీలు, పామిడి 41.6 డిగ్రీలు, యల్లనూరు 41.5 డిగ్రీలు, గుంతకల్లు 41.1 డిగ్రీలు, తాడిమర్రి 41.1 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి 40.9 డిగ్రీలు, ధర్మవరం 40.7 డిగ్రీలు, కొత్తచెరువు 40.7 డిగ్రీలు, అనంతపురం 40 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 50 నుంచి 80, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 5 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచాయి.