Temper film
-
రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి
మరో నటి పెళ్లి చేసుకుంది. రహస్యంగా ప్రియుడితో ఏడడుగులు వేసింది. అయితే ఈ వేడుకకు ఒకే ఒక్క తెలుగు హీరోయిన్ మాత్రమే హాజరైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి) 'టెంపర్' సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అపూర్వ శ్రీనివాసన్.. జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్ 2 తదితర చిత్రాల్లో పలు పాత్రలు చేసింది. ఈమె చివరగా 2022లో 'నీతో' మూవీ చేసింది. తర్వాత సైలెంట్ అయిపోయింది. తాజాగా శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి షాకిచ్చింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కూడా ఈ పెళ్లికి వెళ్లింది. (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) View this post on Instagram A post shared by Apoorva Bin Srinivasan (@apoorva_srinivasan) -
జీవితంలో అది ఉండాలి
కాజల్ అగర్వాల్ తన నట జీవితంలో మార్పు కోరుకుంటున్నారు. నటిగా దశాబ్దం కాలం పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్గా ప్రకాశిస్తున్న ఈ భామకీస్థాయి అంత సులభంగా రాలేదు. కాజల్ పయనం ఫ్లాప్లతోనే మొదలైంది. తమిళంలో తొలి రోజుల్లో బొమ్మలాటం, మోది విళైయాడులాంటి చిత్రాలు ఈ ఉత్తరాది బ్యూటీని చాలా నిరాశపరిచాయి. ఇంకా చెప్పాలంటే ఆ మధ్య నటించిన తుపాకీ వరకు కోలీవుడ్లో ఈ అమ్మడికి బిగ్ హిట్ లేదు. అయితే టాలీవుడ్లో చందమామ చిత్రం తొలి ఆనందాన్ని నింపగా మగధీర చిత్రం స్థాయిని పెంచింది. ఆ తరువాత కమర్షియల్ హీరోయిన్గా ఎదుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ధనుష్ సరసన మాది చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్తో నటించిన టెంపర్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఎన్టీఆర్ చాలా మారారు టెంపర్ చిత్రంపై కాజల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ కొత్త అవకాశాలేమీ లేవు. దీంతో టెంపర్ చిత్ర విజయం ఈమెకు చాలా అవసరం. అయితే టెంపర్ చిత్రంలో నటించడం చాలా మంచి అనుభవం అని కాజల్ పేర్కొన్నారు. ముఖ్యంగా కథానాయకుడు చాలా మారారని, నటనలోనూ పరిణితి పెరిగిందని కితాబిచ్చారు. వివాహానంతరం ఆయనలో మార్పు కనిపిస్తోందని, షూటింగ్లో కూడా కూతురు ముచ్చట్లే వల్లివేసేవారని చెప్పారు. అరుంధతి ఆకట్టుకుంది కథా నాయకి ఇతివృత్తంతో కూడిన చిత్రాలలో నటించాలని ఆశగా ఉందంది. ఆ తరహా కథా చిత్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. మంచి కథలో బలమైన పాత్రలు నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు అన్నారు. అలాగని కమర్షియల్ చిత్రాల్లో నటించనని అర్థం కాదన్నారు. ఇటు కథా బలం ఉన్న పాత్రలకు అటు కమర్షియల్ చిత్రాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. నటి అనుష్క నటించిన అరుంధతి చిత్రం తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. అలాంటి కథా చిత్రాలు విజయవంతం అవుతున్నాయన్నారు. ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించిన వారైతై హీరో, హీరోయిన్ అన్న బేధం లేకుండా ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాన్ని కాజల్ వ్యక్తం చేశారు.